Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన హామీలు నెరవేర్చేవరకు పోరాటం కొనసాగించాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ ఉదయం అమరావతిలో ముఖ్యమంత్రి ఎంపీలతో సమావేశమయ్యారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీలతో చర్చించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని బడ్జెట్ తొలివిడత సమావేశాల్లో జాతీయస్థాయిలో గొంతెత్తి చాటామని, అదే స్ఫూర్తితో తదుపరి సమావేశాల్లోనూ నిరసన తెలిపి, డిమాండ్లు సాధించుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏపీ డిమాండ్లపై కేంద్రవైఖరిలో వచ్చిన సానుకూల మార్పును కొందరు ఎంపీలు ప్రస్తావించగా, మరికొందరు ఎంపీలు అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ నమ్మలేమని వ్యాఖ్యానించారు. జోన్, ప్రత్యేక హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీ, విద్యాసంస్థలు, రాజధానికి నిధులు తదితరవిషయాలపైనా ఎంపీలు చంద్రబాబుతో చర్చించారు. ఢిల్లీలో పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, కేంద్రమంత్రులను కలుస్తూ, రాష్ట్ర సమస్యలను వారికి వివరించాలని చంద్రబాబు ఎంపీలను ఆదేశించారు.