Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చంద్రబాబు అంటే రాజకీయ చాణక్యుడు. ఈ విషయం ప్రత్యర్థులైనా ఒప్పుకోవాల్సిందే. అందుకే చాలా మంది ఆయన ప్రత్యర్థులు సైతం.. ఎన్నికల వ్యూహాల విషయంలో బాబు రూటే ఫాలో అవుతారు. ప్రతి చిన్న అంశంపైనా అర్థరాత్రి వరకు సమీక్షలు నిర్వహించడం బాబు స్టైల్. అలా ఆయన ముందుగానే అన్నింటికీ ప్రిపేరైపోతారు. ఇప్పుడు కృష్ణ మాదిగ ఆందోళనకు కూడా అలాగే రెడీ అయ్యారు. కానీ ఈ విషయం తెలియని మాజీ మంత్రి రావెల అడ్డంగా బుక్కయ్యారు.
నిజానికి తెలంగాణతో పోలిస్తే ఏపీలో మాదిగల సంఖ్య తక్కువ. అయినా కేబినెట్లో మాదిగలకు సముచిత గౌరవం ఇచ్చారు బాబు. కానీ తెలంగాణ కేబినెట్లో అసలు వారికి స్థానమే లేదు. అలాంటి సమయంలో కేసీఆర్ ను నిలదీయడం మానేసి.. తనకు వ్యతిరేకంగా మంద కృష్ణ మాట్లాడటం చంద్రబాబుకు నచ్చలేదు. అదే సమయంలో మాజీ మంత్రి రావెల.. క్యాబినెట్ నుంచి రిజైన్ చేశాక పార్టీతో అంటీముట్టనట్లు ఉంటూ.. మంద కృష్ణకు అండదండలందిస్తున్నారని బాబుకు తెలిసింది.
అంతే టీడీపీ మాదిగ నేతల సమావేశంలో రావెల దుమ్ము దులిపేశారు చంద్రబాబు. తెలంగాణ నేత అయిన మంద కృష్ణ.. ఇప్పుడు ఏపీకి ఎందుకొచ్చారని రావెల అనగానే.. మీలాగా షెల్టర్లు ఇచ్చేవాళ్లుంటే ఎక్కడికైనా వస్తారని బాబు రిప్లైతో రావెల అవాక్కయ్యారట. తర్వాత సర్దిచెప్పినా.. ప్రతి చిన్న విషయం బాబు దృష్టిలో ఉందన్న విషయం తెలిసి, మిగతా నేతలకూ చెమటలు పట్టాయట. ఈ లెక్కన బాబు నెట్ వర్క్ ఎలా ఉంటుందో.. అందరికీ అర్థమైపోయింది.
మరిన్ని వార్తాలు