Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ లో కొన్నాళ్లుగా అసంతృప్తితో రగిలిపోతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నందమూరి హరికృష్ణని కదిలించడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెనుకాడారు. పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాలకు హరికృష్ణ రాకపోయినా ఆయన్ని తప్పించడానికి చంద్రబాబు ధైర్యం చేయలేకపోయారు. మరోవైపు హరిని బుజ్జగించడానికి ఆయనకి మరోసారి రాజ్యసభ లో స్థానం కల్పించడానికి బాబు ప్రయత్నిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్ని బలపరిచేలా తాజాగా పొలిట్ బ్యూరో లో బావమరిది హరికృష్ణని కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 17 మందితో కూడిన పొలిట్ బ్యూరో ని బాబు ప్రకటించారు. కేవలం రెండు మార్పులు మాత్రమే చేశారు. తెలంగాణ లో టీడీపీ ని మళ్లీ శక్తిమంతం గా తీర్చిదిద్ధేందుకు మొత్తం 17 లో 8 మందికి ఆ ప్రాంతం నుంచే స్థానం కల్పించారు. టీడీపీ పొలిట్ బ్యూరో ఇలా వుంది.
• టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్స్ (17)
1. అశోక్ గజపతిరాజు
2. యనమల రామకృష్ణుడు
3. నిమ్మకాయల చినరాజప్ప
4. కేఈ కృష్ణమూర్తి
5. నందమూరి హరికృష్ణ
6. దేవేందర్ గౌడ్
7. కాలువ శ్రీనివాసులు
8. ఎలిమినేటి ఉమామాధవరెడ్డి
9. రేవంత్ రెడ్డి
10. మోత్కుపల్లి నర్సింహులు
11. రావుల చంద్రశేఖర్ రెడ్డి
12. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
13. ప్రతిభాభారతి
14. నామా నాగేశ్వరరావు
15. అయ్యన్నపాత్రుడు
16. రేవూరి ప్రకాశ్ రెడ్డి
17. సీతక్క