Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలు ఆడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కర్నూల్ నుంచి బీజేపీ నేతలు ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ పై ముఖ్యమంత్రి స్పందించారు. టీడీపీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీకి రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. రాయలసీమను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని చెప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో సీమకు నీరు అందించామని తెలిపారు. తాను కూడా రాయలసీమ బిడ్డనే అన్నారు. కర్నూల్ లో సుప్రీంకోర్టు బెంచ్, అమరావతిలో దేశ రెండో రాజధానిని ఏర్పాటు చేస్తే… అప్పుడు బీజేపీ చిత్తశుద్ధి ఏమిటో అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని పార్టీ నేతలకు సూచించారు. కేంద్రంపై ఒత్తిడిపెంచే విషయంలో టీడీపీ అనుసరించాల్సిన వైఖరిపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం తన మాట నిలబెట్టుకోలేదని, అందుకే టీడీపీ పోరాటం చేస్తోందని చంద్రబాబు చెప్పారు. విభజన హామీల కోసం మిత్రధర్మాన్ని పక్కనబెట్టి మరీ టీడీపీ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు రాయలసీమ డిక్లరేషన్ తెరపైకి తెచ్చారు. రాష్ట్ర రెండో రాజధాని రాయలసీమలో ఏర్పాటుచేయడం, రాయలసీమకు రూ. 20వేల కోట్ల ప్రత్యేకనిధి వంటి కొన్ని డిమాండ్లతో బీజేపీ ప్రజకటించిన సీమ డిక్లరేషన్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. హామీల అమలుకోసం టీడీపీ చేస్తున్న పోరాటం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ను తెరపైకి తెచ్చిందని పలువురు విశ్లేషిస్తున్నారు.