Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ ప్రాపకం కోసం వైసీపీ గుంటనక్క వేషాలు వేస్తోందని… ఇది అత్యంత హేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయి ప్రధాని అపాయింట్ మెంట్ కోరిన విషయం టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయం కారిడార్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుగుతూ, దర్యాప్తు సంస్థలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పీఎంవో పరిసరాల్లోకి ఇలాంటి వ్యక్తిని అనుమతించరాదన్నారు. విజయసాయికి అపాయింట్ మెంట్ ఇస్తే అది పీఎంవోకే అవమానకరమని బాబు వ్యాఖ్యానించారు.
ప్రధానితో విజయసాయిరెడ్డి భేటీ అయితే సీబీఐ కేసులపై ప్రభావం పడే అవకాశముందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు వైసీపీ నేతలు నానాతంటాలు పడుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలను తూర్పారబట్టాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రతి చర్యను ఓ కంట కనిపెట్టాలని, ఎవరికి వారు దీనిపై స్పందించాలని సూచించారు… విజయసాయిరెడ్డి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును కలిసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు కోరారు.