Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ రోజు ఏపీ మొత్తం ప్రత్యేక హోదా అంశం మీద రగిలిపోతోంది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొడితే, తాము అండగా ఉంటామన్న బీజేపి ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని చట్టం లో లేదని మాట మర్చేయగా ఇప్పటి వరకు కలిసి ఉన్న తెలుగుదేశం కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేసి హోదా సాధన కోసం ఆందోళన మొదలుపెట్టింది. తెలుగుదేశం లాగానే బీజీపీని నమ్మి మద్దతు ఇచ్చి ప్రచారాలు సైతం చేసిన పవన్ కూడా వారికి వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీల మద్దతు తీసుకుని హోదా సాధన కోసం ఆందోళన మొదలు పెట్టారు. కాని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయిన వైసేపీ మాత్రం పార్లమెంట్ బయట తమ ఎంపీలతో చేయిస్తున్న నినాదాలు మినహా ఇంకేమీ ఆందోళనలు చేయడం లేదనే విషయం చిన్న పిల్లాడికి సైతం అర్ధమవుతుంది.
ఈరోజు ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న పార్టీలు మూడు తెలుగుదేశం, జనసేన, వైసీపీ. ఈరోజు ఆయా పార్టీల అధినేతల షెడ్యుల్ చూస్తే చంద్రబాబు సైకిల్ యాత్ర లో పాల్గొన్నారు. వెంకటపాలెం గ్రామ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బాబు అసెంబ్లీ వరకూ సైకిల్ పై బయలుదేరారు. ఇక పవన్ విషయానికి వస్తే ప్రత్యేక హోదా సాధన కోసం లెఫ్ట్ పార్టీలతో జనసేన చేస్తున్న పాదయాత్రలని విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉదయం 10 గంటలకు సీపీఎం, సీపీఐ నాయకులతో కలిసి పవన్ కల్యాణ్ పాదయాత్రను ప్రారంభిచారు ఏలూరు రోడ్ మీదుగా రామవరప్పాడు రింగ్ వరకూ ఈ యాత్ర సాగుతోంది. ఇక జగన్ విషయానికి వస్తే ఎప్పటిలానే ఈ శుక్రవారం కూడా అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు. అయితే ఈ కేసు ఈ నెల 13 కి కోర్టు వాయిదా వేసింది. అయితే ఈ ముగ్గురి ప్రోగ్రామ్స్ చుసిన నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఒకరు సైకిల్ యాత్ర, మరొకరు పాదయాత్ర, ఇంకొకరు కోర్టు యాత్ర చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నారు.