బీజేపీతో బాబు కుమ్మక్కు అయ్యారా ? జగన్ లాజిక్ లేని ఆరోపణ

Chandrababu Delays Ycp Mps Resignations

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్ర‌త్యేక హోదా సాధ‌న పోరాటంలో భాగంగా ఐదుగురు వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే రాజీనామాలు సమర్పించింది మొదలు ప్రత్యేక హోదా కోసమే రాజీనామా చేశాం ప్రజల ఒత్తిడితోనే రాజీనామా చేసాం అని పేర్కొనడంతో వారి రాజీనామాలను లోక్ స‌భ స్పీక‌ర్ వెంట‌నే ఆమోదించ‌లేదు. ముందు ఒకసారి ఎంపీల‌తో స‌మావేశ‌మై మరో సారి పున‌రాలోచించుకోవాలంటూ సూచించిన ఆమె గత వారం సమావేశమయి కూడా అదే చెప్పి ఈసారి సమయం ఇచ్చారు. కర్నాటక ఎన్నికల నేపధ్యంలో అక్కడి బీజేపీ ఎంపీలు చేసిన రాజీనామాలని క్షణాల్లో ఆమోదించిన స్పీకర్ వీరి రాజీనామాలు మాత్రం ఇప్పటికీ పెండింగ్ లోనే పెట్టారు. రాజీనామాల‌పై భాజ‌పా ఎందుకింత తాత్సారం చేస్తోంద‌నేది అందిరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని కవర్ చేయడానికి స్పీకర్ కొన్ని కారణాలు చెబుతున్నా ఇప్పుడు జగన్ తెరమీదకు తెచ్చిన వాదనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.

బీజేపీతో చంద్రబాబు కుమ్మక్కై వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించకుండా అడ్డుకున్నారని జగన్‌ ఆరోపించారు. పార్టీ మారిన ముగ్గురు ఎంపీలపై అనర్హత వేటుపడకుండా కూడా కుట్ర చేశారని ఆరోపించారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనుగోలు చేసి ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారన్నారు. త‌మ ఎంపీల రాజీనామాల‌ను ఆమోదించ‌కుండా చంద్రబాబు అడ్డుప‌డ్డార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించ‌డం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి, ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంతో ఏపీ స‌ర్కారు పోరాటానికి దిగితే, దీనిని తమకు అనుకూలంగా మలుచుకుని భాజ‌పాతో స‌యోధ్య‌కి ప్ర‌య‌త్నించింది వైకాపా. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్ర‌ధాని కార్యాల‌యంలయాన్ని తన విశ్రాంతి మందిరంగా మార్హ్సుకున్నారని అప్పట్లో విజయసాయి రెడ్డి మీద మీడియా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందేనని ఇప్పుడు జగన్ చంద్రబాబు మీద బండలు వేస్తే సరిపోతుందా ? అని విశ్లేషకులు అంటున్నారు.

ఇక‌ ఎంపీలు కూడా రాజీనామాల చాలా వ్యూహాత్మకంగా చేశారు. పార్ల‌మెంటు స‌మావేశాల చివ‌రి రోజు వ‌ర‌కూ వేచి చూసి అప్పుడు రాజీనామాలు చేశారు. చివ‌రి రోజు కావ‌డం, రాజీనామాలు చేసిన వెంట‌నే నిరాహార దీక్ష‌లంటూ ఎంపీలు స్పీక‌రుకు అందుబాటులో లేకుండాపోవడంతో అప్పటికప్పుడు రాజీనాలు ఆమోదించలేని పరిస్థితి. కర్ర విరక్కుండా పాము ఎలా చంపాలో బాగా తెలిసిన వైసీపీ పేరుకు రాజీనామా చేసాం స్పీకరే ఆమోదించట్లేదు అని ఇప్పుడేమో కొత్తగా బీజేపీతో కుమ్మక్కయ్యి బాబే రాజీనామాలు ఆమోదించట్లేదు అని కొత్త పాత మొదలెట్టింది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.