టీడీపీ లోకి ముందు చెన్నుపాటి… ఆపై వంగవీటి?

Chennupati enters tdp followed by vangaveeti

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ని నిర్దేశించే అతి కీలక ఘట్టం 2019 అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఘట్టాన్ని కులాల వారీగా విడదీసి టీడీపీ అధినేత చంద్రబాబుని దెబ్బ కొట్టాలని బీజేపీ వ్యూహం . అందులో భాగమే కన్నా లక్ష్మీనారాయణ ని హడావిడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేయడం. ఇక ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ టార్గెట్ గా ఎన్నికల రణరంగంలోకి దూకడం కూడా బీజేపీ వ్యూహంలో భాగమే అని జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాపుల మద్దతు కూటగట్టుకోవడం సీఎం చంద్రబాబుకి పెద్ద సవాలే. ఈ పరిస్థితికి తోడు జేడీ లక్ష్మీనారాయణ కూడా కొత్త పార్టీ పెట్టడమో , బీజేపీ లో చేరడమో చేస్తే పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారతాయి.

అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో దక్షిణ కోస్తాలో టీడీపీ పట్ల ఎంతోకొంత సానుకూలత ఏర్పడింది. అయితే కాపుల్లో వ్యతిరేకత వస్తే ఆ నాలుగు జిల్లాల్లో వున్న సానుకూలత వచ్చే ఎన్నికల్లో గెలుపు ముంగిట ఆగిపోవచ్చు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత టీడీపీ మీద అంతకు ముందు ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు కాపుల్లో లేదని ఓ అంచనా. అయినా ఎక్కడో అనుమానం. అసలు కోస్తాలో కాపులు , కమ్మల మధ్య గొడవకి మూలం అయిన బెజవాడ రాజకీయాల మీద టీడీపీ అధినేత ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వంగవీటి రంగా రాజకీయ వారసుడు రాధా ని పార్టీలోకి తీసుకొచ్చి కాపులని ఆకట్టుకోడానికి టీడీపీ తెర వెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగమే వంగవీటి రాధా , రంగా మిత్రమండలి సభ్యుడు చెన్నుపాటి శ్రీను విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశం అని తెలుస్తోంది. రంగా బావమరిది అయిన శ్రీను మరో రెండు రోజుల్లో కొత్త పార్టీలోకి చేరే అవకాశం ఉందని ఆ సమావేశంలో ప్రకటించారు. ఆ సమావేశానికి కాపు పెద్దలు చాలా మంది వచ్చారు. వారితో శ్రీను చెప్పిన మాటలు బట్టి చూస్తే ఆయన టీడీపీ వైపు మొగ్గు జూపే అవకాశాలు మెండుగా వున్నాయి. అయితే శ్రీను ఆలోచనల మీద ఎక్కడా పెద్ద వ్యతిరేకత కూడా కనిపించలేదు. కాపు పెద్దలు ఎవరూ చెన్నుపాటి శ్రీను చెప్పిన అభిప్రాయంతో విభేదించలేదు. దీంతో విజయవాడ పాలిటిక్స్ లో కొత్త ఒరవడి వచ్చే ఛాన్స్ వుంది.

అయితే టీడీపీ లోకి చెన్నుపాటి చేరిక ఆరంభం మాత్రమే అని టీడీపీ సీక్రెట్ ఆపరేషన్ గురించి తెలిసిన వాళ్ళు చెబుతున్న మాట. చెన్నుపాటి చేరిక తర్వాత అదను చూసి వంగవీటి రాధాని కూడా పచ్చ జెండా కిందకి తీసుకొచ్చే ప్రయత్నాలు స్పీడ్ గా జరుగుతున్నాయట. ఈ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చి టీడీపీ వ్యూహం పారితే విజయవాడ , దక్షిణ కోస్తాతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొత్త మలుపు తీసుకోవడం ఖాయం.