Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ మంత్రి ఇంకో మంత్రిని తప్పుబట్టారు. ఇది చాలు ఏ రాష్ట్రంలో అయినా అధికార పక్షాన్ని ప్రతిపక్షం ఉక్కిరిబిక్కిరి చేయడానికి. కానీ విశాఖ భూకుంభకోణం విషయంలో మాత్రం అలా జరగడం లేదు. రెండు రోజుల పాటు పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపించిన ఈ వ్యవహారం క్రమంగా ఇంపార్టెన్స్ కోల్పోతోంది. విశాఖలోని కొమ్మాది, మధురవాడ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జా అయినట్టు, ఆ కుంభకోణంలో పలువురు రాజకీయనేతల హస్తం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అదే టైం లో మంత్రి అయ్యన్న పరోక్షంగా గంటా మీద ఆరోపణలు గుప్పించారు.
ప్రతిపక్షంలో వున్న వైసీపీ నిజానికి ఈ వ్యవహారాన్ని పార్టీ ప్రయోజనాలకు వాడుకోవాల్సింది. కానీ అధిష్టానం దూతలుగా విశాఖ వచ్చిన విజయసాయి రెడ్డి సహా స్థానిక నేతలంతా ఆరోపణలు వస్తున్న వారి గురించి వదిలేసి ఈ కుంభకోణంతో చంద్రబాబు కుమారుడు లోకేష్ హస్తం ఉందని చెప్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. స్థానిక పరిస్థితులు తెలిసిన నేతలెవ్వరూ వీరి మాట పట్టించుకోలేదు. లోకేష్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ హడావిడి చేయడంతో స్కాం గురించి కాక ఇది రాజకీయ ప్రేరేపిత వ్యవహారంగా మిగిలిపోయింది. స్థానిక వైసీపీ నేతలు కొందరికి ఈ కుంభకోణంతో సంబంధాలు వున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
విశాఖ భూకుంభకోణంలో అన్ని పరిస్థితుల్ని అంచనా వేసుకున్న చంద్రబాబు అనూహ్యంగా సిట్ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలైందో అప్పటినుంచి వైసీపీ నాయకుల గొంతు ఇంకా తగ్గిపోయింది. దీనికి కారణం వైసీపీ నేతలు ఎందరో ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తలదూర్చిన విషయం మీద గట్టి ఆధారాలు వున్నాయట. ఆగష్టు లో సిట్ ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి వుంది. ఆ నివేదిక లో తమ పేరు రాకుండా చూసుకోవడం మీదే వైసీపీ నాయకులు దృష్టి పెట్టారంట. ఇలా లోకేష్, సిట్ అంశాలు విశాఖలో వైసీపీ ఫెయిల్యూర్ కి కారణం అయ్యాయి.