అప్పుడు బాబే,ఇప్పుడు బాబే ఎందుకు ?

Chandrababu headache on ap caste politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అప్పట్లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం వచ్చాక కాపు రిజర్వేషన్ పోరాటం, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ రణం సీఎం చంద్రబాబుని టార్గెట్ చేయడం అందరికీ కనిపిస్తూనే వుంది. ఇవి ఒక్క చంద్రబాబు చేయగలిగినవి కాదని అడుగుతున్నవారికీ తెలుసు. ఇప్పుడు ఇంకా నయం బాబు అధికారంలో వున్నాడు కాబట్టి అడుగుతున్నాం అనే అవకాశం వుంది. కానీ ఆ లాజిక్ ని కూడా కాస్త విశ్లేషిస్తే డిమాండ్స్ చేసే వారి లోగుట్టు బయటపడుతుంది. 2004 నుంచి 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాబు అధికారంలో లేరు. ఈ సమస్యలు అప్పుడూ వున్నాయి. బాబు ఇచ్చిన హామీలు అప్పట్లో కాంగ్రెస్ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ ని అంతా తానై నడిపించిన వై.ఎస్ వున్నారు. అయినా ముద్రగడకి ఎప్పుడూ నోరు పెగల్లేదు. కాపుల సమస్యలు గుర్తుకు రాలేదు. అధికారంలో వున్న వాళ్ళు ఎంత క్లిష్టమైన సమస్య అయినా పరిష్కరించాల్సిందే అంటే ఇప్పుడు ప్రశ్నించే గొంతులు అప్పుడు ఏమయ్యాయి.

బాబు అధికారంలో వున్నాడు కాబట్టి ఈ సమస్య అనుకోడానికి వీల్లేదు. ఆయన ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా తెలంగాణ అంశం మొత్తాన్ని ఆయన చుట్టూనే తిప్పారు. ఆయన ఎక్కడికి వెళ్లినా వెంటాడారు. వేటాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ముద్రగడ, మంద కృష్ణ, ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని తప్పుబడుతూ గొంతెత్తుతున్నారు. పైకి ఎలా కనిపిస్తున్నా ఇదేదో కాకతాళీయంగా జరుగుతున్న వ్యవహారం కాదని రాష్ట్రంలో చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు. 2014 లో టీడీపీ కి అండగా నిలబడిన వర్గాల్ని చీల్చకపోతే మనుగడ సాగించడం కష్టమని భావిస్తున్న విపక్షం తుపాకీ ఇంకోరి భుజాన పెట్టి బాబుని టార్గెట్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే విభజన రాజకీయాల ద్వారా అధికారం కోసం వైసీపీ కలలు కంటోంది. కులాల చిచ్చు రగిల్చి 2019 లో పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్న వైసీపీ వల్ల చంద్రబాబుకి ఎదురవుతున్న సవాల్ కన్నా పెద్ద సవాల్ ని ఎదుర్కొంటోంది ఆంధ్ర సమాజం. విధానాలు చూసి జనం ఓట్లు వేస్తారా లేక కులాలని చూసి ఓట్లు వేస్తారా తేల్చుకోండని వైసీపీ విసురుతున్న సవాల్ 2019 లో ప్రజలు ఇచ్చే తీర్పు ఓ ప్రమాణంగా నిలవనుంది. అది ఉన్నత ప్రమాణం అవుతుందా లేక చిల్లర రాజకీయపు ప్రమాణం అవుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు

జగన్ పాదయత్రకి బ్రేక్ ?

ఉదయం, ఆంధ్రపత్రిక మళ్లొస్తున్నాయా… ఆర్కే స్ఫూర్తి?

ఇడుపుల పాయలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారా..?