తెలంగాణలో శాసనసభ రద్దు, తదనంతర పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీలోని చంద్రబాబు చాంబర్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో జరిగిన పరిణామాలపై గంటకుపైగా సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేసీఆర్-మోడీ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని భేటీలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
అసెంబ్లీ రద్దుకు కారణాలు చెప్పకుండానే రద్దు చేసేశారని, జోనల్ వ్యవస్ధకు ఆమోదం రద్దు తదనంతర పరిణామాలు చూస్తోంటే ఇదంతా ప్లాన్ చేసుకున్న ప్రోగ్రాంలాగా ఉందని ఒక మంత్రి అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. రాజ్యాంగ వ్యవస్ధలయిన ఎన్నికల కమిషన్, గవర్నర్ చేసే పనులను కూడా కేసీఆరే చెప్పేస్తున్నారని వెనుక మోడీ లేకుంటే కేసీఆర్ అలా ఎలా ధైర్యంగా ప్రకటిస్తారని మరో మంత్రి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పొత్తులు ఇతరాత్ర వ్యవహారాలపై తెలంగాణ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కనుసన్నల్లోనే కేసీఆర్, జగన్, పవన్ నడుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించకపోవడం దానికే సంకేతమని రాయలసీమకు చెందిన ఓ నేత అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
ReplyForward
|