Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ముందు నుండీ కాంగ్రెస్ బీజేపీలకి ప్రత్యామ్నాయం కావాలని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ కాలికి బలపం కట్టుకుని అన్ని రాష్ట్రాలను చుట్టి వచ్చారు. అయితే కర్నాటక ఎన్నికల అనంతరం ఇది మరో టర్న్ తీసుకునే విధంగా కనిపిస్తోంది. కర్ణాటక పరిణామాలు దేశ రాజకీయాలపై పెను ప్రభావాన్నే చూపనున్నాయి. ఇవి రాజకీయ శక్తుల అపూర్వకలయుకలకు అవకాశం కల్పించాయని చెప్పాలి. లోక్‌సభ ఎన్నికలు దాదాపు 10నెలలున్న తరుణంలో కర్ణాటక పరిణామాలు కాంగ్రెస్, బీజేపీల్ని చిక్కుల్లో పడేశాయి. తనను ఏకాకిని చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని బీజేపీకి, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు చాలా అవసరమని కాంగ్రెస్‌కు కర్ణాటక ఎఫెక్ట్ తేల్చి చెప్పేసింది. ఒకానొక సమయంలో కాంగ్రెస్ అరాచకాలకు బలైన పార్టీలన్నీ ఒక్కటిగా జట్టు కట్టాయి. దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చాయి. ఫలితమే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు గవర్నర్ల వ్యవస్థను తరచుగా దుర్వినియోగం చేసేది. ఫలితంగా బాధిత పక్షాలన్నీ నేషనల్ ఫ్రంట్ పేరిట ఒక్కటయ్యాయి.ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
మమతా బెనర్జీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని ఆమె చెప్పారు. దేశ భవిష్యత్ కోసం మేమంతా ఏం చేయాలన్నా ధైర్యంగా చేస్తామని మమత వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం అంతా కలిసి పనిచేస్తామని మమతాబెనర్జీ స్పష్టం చేశారు. మాయావతి కూడా ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. టీడీపీ, బీఎస్పీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై తిరుగుబాటును ప్రకటించాయి. అధికారంలో ఉన్న పార్టీ అరాచకాలు అదుపుచేయలేని పరిస్తుతులకి చేరినప్పుడు ఇలా ప్రత్యామ్నాయ ఫ్రంట్ల వైపు జనం మొగ్గు చూపుతారు. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ అనుసరించిన అప్రజాస్వామిక పోకడలకు నిరసనగా బాధితపక్షాల ఐక్యకూటమి పురుడు పోసుకుంటోంది. జేడీఎస్ నేత కుమారస్వామి సీఎం అభ్యర్ధిగా ప్రకటించినప్పటి నుండి బీజేపీకి అసలు సవాల్ మొదలైంది. ప్రమాణస్వీకారం వేదికగా పలు ప్రాంతీయ పార్టీల నేతలు కలిశారు. రాహుల్ గాంధీతో పాటు… బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు సైద్ధాతికంగా కలిసివచ్చే పార్టీల నేతలు ప్రమాణస్వీకారానికి వచ్చారు. ఇదే వేదికగా బీజేపీ ఏకాకిని చేసేందుకు వీరంతా ముందడుగు వేయాలని నిశ్చయించారు.
కుమారస్వామి ప్రమాణాస్వీకారోత్సవానికి హాజరైన చంద్రబాబు… పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను ఏకం చేసే ప్రయత్నం చేశారని అంతర్గత చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్, మమత బెనర్జీ లాంటి వారితో ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన అంతరార్థం కూడా అదేనని ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని అధినేతలు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి ఊతం ఇచ్చేలా మమతతో సమావేశం అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని ఆమె చెప్పారు. దేశ భవిష్యత్ కోసం మేమంతా ఏం చేయాలన్నా ధైర్యంగా చేస్తామని మమత వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం అంతా కలిసి పనిచేస్తామని మమతాబెనర్జీ స్పష్టం చేశారు. మాయావతి కూడా ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. టీడీపీ, బీఎస్పీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై తిరుగుబాటును ప్రకటించాయి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక మాయావతి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో చంద్రబాబు భేటీ కావటం మొదటిసారి. దీంతో రానున్న రోజుల్లో రాజకీయం ఎన్ని మలుపులు తిరగుతుందో అని రాజేకీయ విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.
ఈ భేటీల అనంతరం చంద్రబాబు కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. జాతీయగీతాలాపనతో ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తికాగానే వేదికపై ఉన్న అగ్ర నేతలంతా ఒకరితో మరొకరు కరచాలనం చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చంద్రబాబు వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు రాహుల్ భుజంపై చేయి వేసి అభినందించారు. ఇద్దరూ కొన్ని క్షణాలు మాట్లాడుకున్నారు. మూడున్నర దశాబ్దాలకుపైగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ అధినేతలు ఇలా ఆప్యాయంగా పలకరించుకోవడం భవిష్యత్ రాజకీయపరిణామాలకు సంకేతమని పలువురు విశ్లేషిస్తున్నారు.