చంద్రబాబుపై తనకు ఎంత అభిమానం ఉందో ఆయన అరెస్ట్ అయినరోజే పవన్ కల్యాణ్ చాటి చెప్పారు . ఆరోజు పవన్ కి ఆయన్ను నేరుగా కలిసే అవకాశం రాలేదు, ఆ తర్వాత బాబు జైలుకి వెళ్లడంతో అవకాశం దొరకలేదు. చంద్రబాబుకి బెయులొస్తుందని, లేదా ఆయన్ని హౌస్ రిమాండ్ కి పంపిస్తారనే ఆశ కూడా ఇప్పుడు పూర్తిగా ఆవిరైంది. క్వాష్ పిటిషన్ కూడా వారం రోజులు వాయిదా పడింది. దీంతో పవన్ కల్యాణ్ నేరుగా జైలుకే వెళ్లి చంద్రబాబుని పరామర్శించాలనుకుంటున్నారు.
అయితే.. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును పవన్ కల్యాణ్ ఈరోజు కలవనున్నారు. ఈ మేరకు జనసేన ప్రకటనను విడుదల చేసింది. గురువారం పవన్ రాజమండ్రి వెళ్తున్నారని, అక్కడి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబును కలుస్తారని, ములాఖత్ సమయంలో ఈ భేటీ ఉంటుందని పేర్కొంది. ఈరోజు ఉదయం గం.9.30కు పవన్ రాజమండ్రి చేరుకొని, తొలుత చంద్రబాబు కుటుంబ సభ్యులతో భేటీ కానున్నారు. భువనేశ్వరిని పరామర్శిస్తారు. ఆ తర్వాత ఇద్దరు టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబును ములాఖత్ సమయంలో కలుస్తారు. మధ్యాహ్నం గం.12. సమయానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో కలిసి పవన్ టీడీపీ అధినేతను కలవనున్నారు. ములాఖత్ ఖరారైనట్లు టీడీపీ వర్గాలు కూడా వెల్లడించాయి.