Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అన్ని కష్టాలకు రాష్ట్ర విభజనే కారణమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎంతో కష్టపడి పనిచేస్తున్నామని, ఇంకా కష్టాలు పూర్తిగా తీరలేదని అన్నారు. మనం సమస్యలతో ముందుకెళ్తున్నామని, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మనమే వెనకబడిపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూల్ లో పర్యటించిన ముఖ్యమంత్రి స్థానిక ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అన్ని కష్టాలకు రాష్ట్ర విభజనే కారణమని, కష్టపడి పనిచేస్తున్నామని, ఇంకా కష్టాలు పూర్తిగా తీరలేదని అన్నారు.
మోడీ మనకు అన్యాం చేస్తారని కలలో కూడా ఊహించలేదని, నాలుగు కేంద్ర బడ్జెట్ల వరకూ వేచిచూసి, ఐదో బడ్జెట్ లోనూ మొండిచేయి చూపేసరికి ధర్మపోరాటానికి నాంది పలికానని చెప్పారు. రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజలకోసమే ఆలోచిస్తున్నానని, భావితరాల భవిష్యత్ కోసమే కృషిచేస్తున్నానని అన్నారు. తాను నరేంద్రమోడీపై పోరాడుతుంటే కొందరు తనపై ఫైట్ చేస్తున్నారని, ఇది న్యాయమా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. నరేంద్రడమోడీకి మనపై ఎందుకు కోపమో మీరందరూ అర్ధం చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్ ను అధిగమిస్తామనా….లేకపోతే ఆయనకు ఇష్టం లేదా…? ఆయన చెప్పుచేతల్లో మనం ఉండమనా..? అని నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని చంద్రబాబు మండిపడ్డారు.