Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ సీఎం చంద్రబాబుకు టీడీపీలో మొదట్నుంచీ ఉన్న కుటుంబాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా అనంతపురంలో పరిటాల కుటుంబం ఆయనకు ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో కూడా సునీతను వారించి పెనుగొండలో వ్యతిరేకత ఉందని రాప్తాడు తీసుకెళ్లి పోటీచేసి మరీ గెలిపించుకున్నారాయన. పరిటాల కుటుంబానికి బాబుతో అలాంటి అనుబంధం ఉంది.
అందుకే ఇప్పుడు పరిటాల కొడుకు శ్రీరామ్ పెళ్లికి శుభలేఖల్లో చంద్రబాబే హైలైట్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆశీస్సులతో అంటూ శుభలేఖల్లో పెట్టడం టీడీపీ నేతల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎంతోమంది టీడీపీ నేతలు వారి పిల్లలకు పెళ్లిళ్లు చేసినా.. ఎవరికీ ఈ ఆలోచన రాలేదని.. పరిటాల సునీత మాత్రం తమ స్వామిభక్తి చాటుకున్నారని క్యాడర్ హ్యాపీ ఫీలౌతోంది.
గతంలో కార్యకర్తలు మాత్రమే తమ పెళ్లిపత్రికల్లో ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు వేయడం ఆనవాయితీగా ఉంది. కానీ ఇంతవరకూ సీనియర్ నేతలెవరూ ఇలాంటివి చేయలేదు. పరిటాల సునీత మాత్రం తాను ఎందుకు ప్రత్యేకమో మరోసారి నిరూపించుకున్నారు. దీంతో అటు చంద్రబాబు కూడా చాలా సంతోషించారట. పరిటాల కుటుంబానికి తన అండ ఎప్పటికీ ఉంటుందని సన్నిహితులకు చెప్పారట.