Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 లో టీడీపీ అధికారం చేపట్టాక ఓ రూమర్ బాగా వినిపించింది. ఇక చంద్రబాబుకి చెందిన కమ్మ సామాజిక వర్గం రెచ్చిపోతుందని. ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయే సందర్భాలు ఎన్నో కనిపిస్తున్నాయి. మీడియా మేనేజ్ మెంట్, ప్రభుత్వ పథకాలకు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడానికి టీడీపీ సర్కార్ ఈసారి వివిధ పేర్లతో సమాచార శాఖ ద్వారా పెద్ద సంఖ్యలో జర్నలిస్టుల్ని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంది. సహజంగా వీరిలో ఎక్కువ మంది కమ్మ వాళ్ళు ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ నిజం అది కాదని వాస్తవ పరిస్థితి చూసిన వారికి అర్ధం అవుతుంది.
టీడీపీ సర్కార్ చేసిన ఈ నియామకాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మీడియా సలహాదారుగా వ్యవహరిస్తున్న పరకాల ప్రభాకర్, సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ కీలక పాత్ర పోషించారు. నియామకాలు అయ్యాక చూస్తే ఏలేస్తారనుకున్న కమ్మోరికి నామమాత్రపు అవకాశాలే దక్కాయి. మొత్తం నియామకాల్లో ఎక్కువ భాగం బ్రాహ్మణులు, కాపులకు దక్కాయి. అయితే కులపరంగా నియామకాలు జరిగాయి అని చెప్పలేకపోయినా అందులో కీలక పాత్ర వహించినవాళ్లు తమ అనుకున్నవారికి పెద్ద పీట వేశారని ఇటు మీడియా , అటు సమాచార శాఖలో గుప్పుమంటోంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఓ అధికారి టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఊహించలేదని అన్నారు.
మరిన్ని వార్తలు