Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాతమ్మకంగా భావించిన పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభమయింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నుంచి రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం జగ్గంపేటలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని, నీటి సమస్య లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టుల ద్వారా నేరుగా ఆరు జిల్లాలు, పరోక్షంగా 11 జిల్లాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం పూర్తిచేయటం తన జీవిత కల అని, 2019 నాటికి ప్రాజెక్టు పూర్తిచేస్తామని, చెప్పారు. రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తామని సీఎం హామీఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఇప్పటిదాకా…ప్రాజెక్టుల నిర్మాణానికి 44 వేల కోట్లు ఖర్చుచేశామని, ఈ ఏడాది మరో పదివేల కోట్లు ఖర్చుచేస్తామని తెలిపారు. జలవనరుల శాఖలో మంత్రి నుంచి కింది స్థాయి వరకు అందరూ కష్టపడుతున్నారని, రైతులు కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, వ్యవస్థ లోని అన్ని లోపాలను సవరించామని చంద్రబాబు చెప్పారు. నీటి ద్వారా సంపద సృష్టి జరిగి సుస్థిరమైన సమాజం ఏర్పడుతుందని సీఎం అన్నారు. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం వల్ల శ్రీకాకుళం, విజయనగరం మినహా అన్ని జిల్లాలకు మేలు జరుగుతుందని, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసే అవకాశముందని చెప్పారు. ఏలేరు రిజర్వాయర్ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నీరందిస్తామని సీఎం వివరించారు.
మరిన్ని వార్తలు: