ప‌వ‌న్ కు గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం

governor Narasimhan invites pawan kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ట్విట్ట‌ర్ వేదిక‌గా పార్టీని న‌డుపుతున్నార‌ని విమ‌ర్శ‌లెదుర్కుంటున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కు ప్ర‌జ‌ల్లో గుర్తింపు ల‌భించిందో లేదో తెలియ‌దు కానీ… గ‌వ‌ర్న‌ర్ నుంచి మాత్రం గుర్తింపు ద‌క్కింది. రాజ్ భ‌వ‌న్ లో జ‌రిగే తేనేటి విందుకు రావాల‌ని గ‌వ‌ర్న‌ర్ నుంచి ప‌వ‌న్ కు  ఆహ్వానం అందింది. స్వాతంత్ర్య‌ దినోత్స‌వం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ వివిధ పార్టీల నేత‌ల‌కు తేనేటి విందు ఇవ్వ‌డం సంప్ర‌దాయం. ప్ర‌ముఖ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ ఈ విందుకు ఆహ్వానిస్తారు. ఈ క్ర‌మంలో తొలిసారి జ‌న‌సేన పార్టీ అధినేత‌కు ఆహ్వానం ద‌క్కింది. ఎట్ హోం పేరుతో నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ హాజ‌ర‌వుతున్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు తెలిపాయి. అటు దేశప్ర‌జ‌లంద‌రికీ ప‌వ‌న్ ట్విట్ట‌ర్ లో స్వాంతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పారు.

వ్య‌క్తుల‌కు భిన్న‌మైన ప‌ర్వ‌దినాలు ఉంటాయి కానీ..జాతికి సంబంధించి ఇదొక్క‌టే ఘ‌న‌మైన పండుగ‌రోజు.. జైహింద్ అని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. సంప‌ద‌లు అట్ట‌డుగు వ‌ర్గాల‌కు చేరిన‌ప్పుడే స్వాతంత్ర్యానికి నిజ‌మైన అర్ధం ప‌ర‌మార్ధం ద‌క్కుతాయ‌ని ప‌వ‌న్ అన్నారు. ఎంద‌రో అమ‌రుల త్యాగ‌ఫ‌లితం వ‌ల్లే ఏడు ద‌శాబ్దాల నుంచి మ‌నం స్వాతంత్ర్యం అనుభ‌విస్తున్నామ‌ని, అయితే దేశంలో ఇంకా ఆర్థిక అసమాన‌త‌లు ఉన్నాయ‌ని, వాటిని రూపుమాపేందుకు భ‌ర‌త జాతి అంతా ఒక్క‌టిగా క‌లిసి పోరాడాల‌ని ప‌వ‌న్  పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు:

కిమ్ దూకుడుకు తగ్గిన ట్రంప్

జనసేనాని ఓవరాక్షన్ ఎక్కువైంది

న‌వ్యాంధ్ర‌ను నంబ‌ర్‌ వ‌న్ చేద్దాం