Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు. తాను నమ్మి జట్టుకట్టిన బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో మొండి చేయి చూపించి షాక్ ఇస్తే , తాను ఎంతో గౌరవం ఇస్తున్న జనసేన అధినేత పవన్ తాజా గా అవినీతి ఆరోపణలు చేయడం అంతకు మించిన షాక్. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి, మరీ ముఖ్యంగా అసలే సవాళ్లు ఎదుర్కొంటున్న చంద్రబాబుకి ఇంకా కఠిన పరిస్థితులు తెచ్చిపెట్టాయి. ఈ సవాల్ ని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటాడు ?. ఈ ప్రశ్నకు చంద్రబాబు ఇప్పటికే ఓ వ్యూహం రెడీ చేసుకున్నారట. అదేంటో తెలుసా ?
పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో తమపై యుద్ధం చేసినా తాము కేంద్రం మీద పోరాటం నుంచి దృష్టి మరల్చుకోకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి సభలో పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్, విజయసాయి లతో ఇప్పటిదాకా డ్రామా నడిపిన మోడీ ద్వయం ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోయేసరికి ఇప్పుడు పవన్ ని రంగంలోకి దించారని ఆయన భావిస్తున్నారు. టీడీపీ ముఖ్యులతో ఈ విషయాన్ని ఈ ఉదయం జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు స్వయంగా చెప్పారు. అయితే పవన్ విమర్శలకి స్పందించేటప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయొద్దని ఆయన నేతలకు దిశానిర్దేశం చేసారు. పవన్ కామెంట్స్ ని లైట్ తీసుకుని కేంద్రం మీద దాడి ఉదృతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదే వ్యూహంతో ముందుకెళ్లి జనం మనసులు గెలవాలని చంద్రబాబు అనుకుంటున్నారు.