Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేరాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో నేరాలు జరగడానికి వీలులేకుండా పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. తుళ్లూరులో ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి భూమిపూజ చేసిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. దొంగతనం ఏ రూపంలో జరిగినప్పటికీ…పోలీసలు, ప్రభుత్వం ఉదాసీనత వల్లేనని, ఏ తప్పు చేసినా న్యాయస్థానాల్లో ఏదో ఒక రకంగా తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
నేరాల ఆధారాల విషయంలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్థంగా పనిచేసి నేరస్తులు తప్పించుకోకుండా చేయాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కలిగిఉండాలన్నారు. నేరాలకు అడ్డుకట్టవేసేందుకు ఈ ల్యాబ్ ఏర్పాటుచేస్తున్నామని, నిర్మాణంలో ప్రయివేట్, పబ్లిక్ పార్ట్ నర్ షిప్ కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. మూడేళ్ల తర్వాత ప్రపంచంలోనే మంచి ల్యాబ్ గా దీనికి పేరురావాలన్నారు. ల్యాబ్ నిర్వహణలో పోలీస్ అధికారులు శిక్షణ తీసుకోవాలని సూచించారు. రూ. 400 కోట్ల వ్యయంతో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మిస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు చెప్పారు.