Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చంద్రబాబు, పీవీ నరసింహా రావు ఇద్దరూ తెలుగు వారి కీర్తిని ప్రపంచ నలుదిశలా చాటిన వారే, ఇద్దరు తెలుగు తల్లి బిడ్డలే ఇదొక్కటే కాక వీరిద్దరికీ రాజకీయంగా ఒక బిరుదు కామన్ అదే రాజకీయ అపర చాణక్యుడు ఒకరకంగా చూస్తే చంద్రబాబు కి పీవీ ముందు తరం వాడనే చెప్పాలి. అయితే ఇద్దరిలో మరో సారూప్యత కూడా ఉంది అదేంటంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంతో సమయం తీసుకుంటారు. ఆ నిరణ్యం తీసుకుంటే జరగబోయే పరిణామాలు, ఫలితాలు, అసలు నిర్ణయం తీసుకోవడానికి సాధ్యాసాధ్యాలు అన్నీ చూసుకుని ఎప్పటికో దాన్ని ఫైనల్ చేస్తారు. ఫైనల్ చేయడమే ఆలస్యం ఇక ఆకలి మీదనున్న సింహం లాగా మిగతావన్నీ వదిలేసి ఆ పని మీదే పని రాక్షసుల్లా పడిపోతారు.
దేశం ఆర్ధికంగా దివాలా తీసిన దశలో, రాజీవ్ గాంధీ మరణంతో ప్రధాని పదవి చేపట్టేందుకు పీవీ నరసింహారావును మించిన అర్హులు కాంగ్రెస్ పార్టీలో కనిపించలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు.. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ మైనారిటీ ప్రభుత్వాన్ని చాకచక్యంగా ఐదేళ్లు నెట్టుకొచ్చారు. ఇప్పుడు అదే తరహాలో కేంద్రం రాష్ట్రాన్ని ఒంటరిని చేసింది, ముందు ఇస్తానన్న మాట తప్పి హోదా అనేదే సాధ్యం కాదు అంటూ మాట మార్చేసింది. అటువంటి దశలో ఉన్న అన్ని దారులలోను ప్రయత్నించిన చంద్రబాబు చివరికి నాలుగేళ్ళుగా కలిసి ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో దోస్తీకి రాం రాం చెప్పిన టీడీపీ అధినేత భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టిపెట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఇక అంతా తానయి తన భుజానికెత్తుకోవాలని డిసైడ్ అయ్యారు.
ఇప్పటికే ఓ సారి ఢిల్లీ లో అడుగు పెట్టి అన్ని దాదాపు అన్ని జాతీయ పార్టీ లీడర్ల తోను మాట్లాడి, అప్పటి వరకు ఒక రకంగా మోడీ, రాహుల్ ల మధ్య గేమ్ లా సాగుతున్న దశలో చంద్రబాబు వైల్డ్ కార్డు ఎంట్రీ లాగా దూసుకు వచ్చాడు. ఎన్ని సార్లు ఢిల్లీ కి వచ్చినా పట్టించుకోని నేషనల్ మీడియా ఇటీవల జరిగిన ఆయన పర్యటనని ఆసాంతం కవర్ చేసింది. తెగదెంపులు చేసిన నాటి నుండి తెలుగుదేశం ఎంపీలు ఒక పక్క, వైసీపీ ఎంపీలు మరో పక్క పార్లమెంట్ లో ఎంత నిరశన ప్రదర్శనలు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కాని చంద్రబాబు అడుగు పెట్టీ పెట్టగానే జాతీయ మీడియా అంతా ఆయననే ఫోకస్ చేయడంతో చంద్రబాబు ఇష్యూని కవర్ చేయొద్దు అని మీడియా బాస్ లకి కేంద్ర పౌర సమాచర శాఖ నుండి సైతం ఆదేశాలు వెళ్ళాయి. దీంతో అసలు ఆట మొదలు పెట్టకుండానే ఒక రకంగా ట్రయిల్ బాల్ వేశారు చంద్రబాబు. కేవలం రెండు రోజులు పర్యటిస్తేనే దేశవ్యాప్తంగా చర్చ జరగటం, జాతీయ మీడియా అంతా ఫోకస్ చేయడం, కేంద్రం భయపడి ప్రదర్శనలు ఆపడం చూసి ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గనుక రాజధానిలో ఆమరణ నిరాహార దీక్షకి దిగితే ఇప్పటికే కర్ణాటకలో ఎంతో కష్టపడి ఎన్నికలకి సిద్దమవుతున్న వేళ బీజీపీని ఇరుకున పెట్టచ్చు అనే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ ఆమరణ నిరాహార దీక్షకి తన పుట్టిన రోజు నాడే ప్రారంభిస్తే ఇంకాస్త వేడి పుట్టించవచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో పుట్టినరోజు నుండి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆమరణ దీక్షకి దిగనున్నారు. చంద్రబాబు గనుక దీక్ష ప్రారంభిస్తే ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఆమరణ దీక్ష మొదలుపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకి ఎక్కుతారు. అంతే కాకుండా మోడీ దుర్మార్గం దేశం అంతా తెలిపేందుకు ఈ దీక్ష మరింత సహాయం చేస్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలని, దీక్ష తీరు తెన్నులు మీద ఇప్పటికే ప్రత్యేక బృందం ఒకటి కసరత్తులు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ చక్రవర్తి మీద ఆంధ్రా ప్రకటించిన యుద్ధం ఇంకెంత దూరం తీసుకెళుతుందో వేచి చూడాలి.