Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాలలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ నేతలు… మరో ప్రచారానికి తెరతీశారు. నంద్యాల పొరుగునే ఉన్న జమ్ములమడుగులో బలమైన నేత, ప్రారంభం నుంచి పార్టీ మారకుండా ఉన్నా రామసుబ్బారెడ్డిని ఉఫఎన్నికల ప్రచారానికి వాడుకోవడం లేదని ఆరాతీస్తోంది. అయితే బాబు ఆయన్ను లూప్ లైన్లో పెట్టారని, అందుకే ఎమ్మెల్సీతో సరిపెట్టి సైడ్ చేశారని ప్రచారం చేస్తోంది.
కానీ టీడీపీ వెర్షన్ వేరేగా ఉంది. ఇప్పటికే జమ్మలమడుగు నేత ఆదినారాయణ రెడ్డి ప్రచారంలో కీలకంగా ఉన్నారని, మళ్లీ రామసుబ్బారెడ్డిని రంగంలోకి దించి ఇద్దరి మధ్య అనవసర మనస్పర్థలకు వీలు కలిగించడం బాబుకు ఇష్టం లేదని తెలుస్తోంది. పైగా ఆదినారాయణ రెడ్డి ఇప్పటిదాకా ఘనంగా మాటలే కానీ చేతల్లో ఏమీ చూపించలేదు. అందుకే ఉద్దేశపూర్వకంగా నంద్యాల బాధ్యతలు నెత్తికెత్తారు.
ఈ ఎన్నికల్లో ఫెయిలైతే. అప్పుడు ఆది సీన్ కట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సంగతి రామసుబ్బారెడ్డికి బాబు ముందే చెప్పారని, అందుకే ఆయన సైలంట్ గా తన నియోజకవర్గంలోనే పనిచేసుకుంటున్నారని చెబుతున్నారు. పైగా ఆదినారాయణ రెడ్డి ఎంతకాలం టీడీపీలో ఉంటారనే విషయంలో క్యాడర్ కు సందేహాలున్నాయి. అందుకే ఆయనకు పరీక్ష పెట్టారు చంద్రబాబు.
మరిన్ని వార్తలు: