Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎందరు ఎంతగా ఆవేశపడ్డా శాంతం శాంతం అని చెప్పే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు. ఓ మాట కోపంగా మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే ఆయన తాజా కామెంట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంత దూరం అయినా వెళ్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్ ఎవరికి అన్నదానిపై క్లారిటీ మాత్రం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ కామెంట్ తో ఆయన చేసిన మరికొన్ని కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారో క్లియర్ గా అర్ధం అవుతున్నాయి.
తప్పుడు ఆరోపణలతో పోలవరం ప్రాజెక్ట్ పనులకు అడ్డం పడి ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని చంద్రబాబు చేసిన హెచ్చరిక వైసీపీ ని , వుండవల్లిని ఉద్దేశించి అని అర్ధం అవుతోంది. రాయలసీమకి పట్టిసీమ నీరు ఎలా వస్తుంది అని కొందరు అవగాహన లేకుండా ప్రశ్నిస్తున్నారని జగన్ టార్గెట్ గా చంద్రబాబు కామెంట్ చేశారు. “ ఇంకొందరు వుంటారు. అప్పుడప్పుడు వస్తుంటారు. ఏవేవో మాట్లాడేసి వెళుతుంటారు. అలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు… శ్వేతపత్రం ప్రకటించాల్సిన అవసరం అంత కన్నా లేదు. ఇలా చంద్రబాబు వేసిన పంచ్ జనసేన అధినేత పవన్ కి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవన్నీ బాగానే అర్ధం అవుతున్నాయి కానీ పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకు అయినా వెళతా అన్న చంద్రబాబు మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై అనుమానాలున్నాయి. పోలవరాన్ని ఆపే శక్తి కేంద్రానికి మాత్రమే వుంది. కానీ కేంద్రానికి బాబు ఆ స్థాయిలో వార్నింగ్ ఇవ్వగలరా ? ఇక్కడే ఏదో తేడా కొడుతోంది. ఈ మాటల లోగుట్టు ఏమిటో కాస్త సమయం గడిస్తే గానీ అర్ధం అయేట్టు లేదు.