కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుడు దర్శకుడు అయినటువంటి రాఘవ లారెన్స్ హీరోగా దర్శకుడు పి వాసు తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “చంద్రముఖి 2”. తమిళ నట భారీ హిట్స్ లో ఒకటైన సినిమా చంద్రముఖి కి సీక్వెల్ గా చేసిన ఈ సినిమా అంచనాలు అందుకోలేక విఫలం అయ్యింది. మరి నటి కంగనా రనౌత్ ఈ సినిమాలో చంద్రముఖిగా నటించగా గత నెలలో ఈ చిత్రం అయితే విడుదల అయ్యింది.
ఇక ఈ చిత్రం అయితే ఫైనల్ గా ఓటిటి డేట్ ని లాక్ చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫామ్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేశారు.