చంద్రముఖి తిరిగొచ్చింది అనగానే చంద్రముఖి పార్ట్-3 వస్తుందా అని అనుకునేరు. ఇక్కడ చెప్తుంది హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గం నుండి బీఎల్ఎఫ్ పార్టీ తరపున రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన ట్రాన్సజెండర్ చంద్రముఖి గురించి. ఎన్నికలబరిలో ఒక హిజ్రా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి కావడంతో చంద్రముఖి పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. గోషామహల్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ట్రాన్సజెండర్ చంద్రముఖి రెండురోజులుగా అనగా మంగళవారం నుండి కనిపించకుండా పోవడంతో మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. అంతేకాకుండా బీఎల్ఎఫ్ నేతలు, హిజ్రాలు, ప్రజా సంఘాలు పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించి తమ నిరసనలు వ్యక్తం చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగి, సీసీ కెమెరా ఫుటేజీ మరియు ఫోన్ కాల్స్ ఆధారంగా తమ దర్యాప్తుని ముమ్మరం చేసారు. నిన్న బుధవారం చంద్రముఖి ఆచూకీని ఇందిరా నగర్ లో కనుగొని, రానున్న ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలనే తలంపుతో తనకు తానే కిడ్నప్ డ్రామా కి తెరతీసినట్టుగా తెలుస్తుంది.
తన కాల్ డేటా ఆధారంగా చంద్రముఖి తన సహచర ట్రాన్సజెండర్లతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. తనని న్యాయస్థానంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే చంద్రముఖి వినిపిస్తున్న వాదన వేరేలా ఉంది. ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించి, కిడ్నాప్ చేసి, విజయవాడ తీసుకెళ్లి, అక్కడినుండి చెన్నై కి తరలించాలని చూసారని, ఎలాగోలా తాను వారినుండి తప్పిచుకొని వచ్చేశానని చెప్తుంది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి పేరు వెంకట్ అని చెప్పగా, విజయ్ అనే పేరు మీద గతంలో హిజ్రాలపై దాడి చేసిన ఆరోపణలు ఉండడంతో, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశారు. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కిడ్నాప్ డ్రామా అంతా చంద్రముఖి వేసిన ప్లాన్ అని, ఈ రెండు రోజులు తాను విజయవాడ లో తన సహచర హిజ్రాలతో జాలీగా గడిపి వచ్చి, కిడ్నాప్ అనే హైడ్రామా కి తెరలేపిందని సమాచారం. పోలీసులు ఈ విషయమై దర్యాప్తుని ముమ్మరం చేసిన నేపథ్యంలో నిజాలు అతిత్వరలోనే వెలుగు చూడనున్నాయి.