అంతరిక్ష రంగంలో ఇస్రో మరో ఘనతను సాదించనుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 చివరి కీలక ఘట్టాన్ని చేరుకోనుంది.చంద్రుడి పైన రహస్యాలను గురించి తెలుసుకునేందుకు ఇస్రో చేపట్టిన రెండవ ప్రయోగం ఇది.
సెప్టెంబర్ 7వ తేది అర్ధరాత్రి 1.40గంటలకు చంద్రుడి కక్ష నుంచి కిందకు దిగే క్రమంలో ప్రధాన దశకు సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ లాండర్‌కు చంద్రుడిపై దిగేందుకు ఆదేశిలిస్తారు. ఆ సమయంలో చంద్రుడిపై 35×100 కిలోమీటర్ల కక్ష్యలో, గంటకు 6120 కిలోమీటర్ల వేగంతో విక్రమ్ ల్యాండర్ ఉండబోతుంది . ఇస్రో శాస్త్రవేత్తలు ఆదేశాలు ఇవ్వగానే ల్యాండర్‌లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజన్లు మండుతాయి.ఆ ఇంజన్లు ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ ఆ స్పేస్‌క్రాఫ్ట్ వేగాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. దీంతో ల్యాండర్ తక్కువ వేగంతో కిందకు దిగడం ప్రారంభమవుతుంది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే చంద్రయాన్ 2లో చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా సెప్టెంబర్ 7న అడుగుపెట్టనుంది. చంద్రుడిపై కాలు మోపే ముందు 15 నిమిషాలే చాలా కీలకంగా మారాయి. అత్యంత వేగంతో తిరుగుతున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్ వేగం ప్రస్తుతం గంటకు 6వేల కిలోమీటర్లు ఉంది. అంతటి వేగాన్ని కేవలం 15 నిమిషాల్లోనే క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై నెమ్మదిగా దిగుతుంది. ఇదే చంద్రయాన్ 2లో అతి కీలకమైన చివరి ఘట్టం.