నిత్యం సమాజంలో మాయలు, వింతలు, మోసాలు పలు రకాలైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా కానీ…తెలుసుకుంటున్నాగానీ.. ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. తాజాగా పెళ్లి చేసుకుంటానని చెప్పి సినిమా స్టైల్ లో నమ్మించి మోసం చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఓ జాదూ మహిళా.. పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మోసం చేసింది. దాంతో ఏకంగా రూ. కోటి కాజేసి జంప్ అయిపోయింది. దాంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలను బట్టి చూస్తే.. వసంతనగర్‌కు చెందిన అర్జున్ (రక్షిత పేరు) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా ఉద్యోగిస్తున్నాడు. అతనికి తెలుగు మాట్రిమొనీలో సింధు (రక్షిత పేరు) పేరిట ఓ మహిళ పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్, వాట్సాప్ కాలింగ్ ద్వారా మాట్లాడుకొంటున్నారు. తాను అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నానని సింధు (రక్షిత పేరు) బాగా నమ్మించింది. తన తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌లో ఉంటూ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది.