Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకటి నుంచి ఐదు అంకెలు సరిగ్గా చదవటం లేదన్న కోపంతో ఓ చిన్నారిని తల్లి కొడుతుంటే…కొట్టొద్దని వేడుకుంటూ ఆ చిన్నారి ఏడుస్తున్న వీడియో ఇటీవల నెట్ లో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా…బాలీవుడ్ గాయకుడు తోషి సబ్రి మేనకోడలు. ఆ చిన్నారి పేరు హయా… ఈ విషయం స్వయంగా తోషినే చెప్పారు. అంతేకాదు..హయా తల్లిని కుమార్తెను కొట్టినందుకు అందరూ విమర్శించటం పైనా తోషి సబ్రి స్పందించారు.
ఒక్క వీడియోను చూసి తల్లి ప్రేమను ఎలా అంచనా వేస్తారని తోషి ప్రశ్నించారు. నర్సరీ చదువుతున్న హయా చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉంటుందని, గట్టిగా చెప్పకపోతే ఆడుకోటానికి వెళ్లిపోతుందని…అందుకే తల్లి మందలించిందని తోషి చెప్పారు. ఒక్కో ఇంట్లో పిల్లలు ఒక్కోలా ప్రవర్తిస్తారని, తల్లిదండ్రులు ఇంటిని, పిల్లలను చూసుకుంటూ రెండు రకాల బాధ్యతలు నిర్వహించాలని, వీటిని బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో చిన్న చిన్ప పొరపాట్లు జరుగుతాయని తోషి వివరణ ఇచ్చారు.
హయా గురించి భర్తకు, సోదరుడికి చూపించేందుకే ఆమె వీడియో తీసిందని, సోషల్ మీడియాలో ఈ వీడియో ఇంత వైరల్ అవుతుందని తాము ఊహించలేదని అన్నారు. ఈ వీడియోపై భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లీతో పాటు ఇతర క్రికెటర్లు శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ కూడా కామెంట్లు పెట్టారు. హయా వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ ఛేసిన క్రికెటర్లు పిల్లలను కొట్టొద్దు, దేషించవద్దు..వారి పట్ల ఓర్పు గా ఉండాలి..అని కామెంట్లు పెట్టారు. క్రికెటర్ల వ్యాఖ్యలపైనా తోషి స్పందించారు. కోహ్లీ, ధావన్ కు తమ గురించి తెలియదని, పిల్లల్ని ఎలా చూసుకోవాలో తమకు తెలుసని ఆయన బదులిచ్చారు.
మరిన్ని వార్తలు: