Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చైనాతో సరిహద్దు సమస్య తీవ్రమవడంతో.. కేంద్రం కొత్త ప్లాన్లు ఆలోచిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, ఐటీ దిగుమతులపై సుంకాలు విధించిన సర్కారు.. ఇప్పుడు టెలికాం రంగంపై దృష్టి పెట్టింది. ఎలక్ట్రానిక్స్ లో చైనా కంపెనీల హవా ఎక్కువగా ఉంది. అందుకే పదేళ్లపాటు భారత్ లో కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీలే ఎలక్ట్రానిక్స్ అమ్మాలని కొత్త నిబంధన తేనుంది ప్రభుత్వం.
టెలికాం రంగంలో అయితే చైనా దూకుడుపై ఎప్పట్నుంచో అభ్యంతరాలున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో యాభై శాతం వాటా చైనా కంపెనీలైన వివో, ఒప్పో, లెనోవో, జియోనీదే ఎక్కువ. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇండియన్స్ డిటైల్స్ చైనా ప్రభుత్వానికి వెళుతున్నాయనే ఆరోపణలున్నాయి. అందుకే స్మార్ట్ ఫోన్ భద్రతా ప్రమాణాలపై అఫిడవిట్లు ఇవ్వాలని కోరుతోంది కేంద్రం.
చైనా ఎగుమతులకు బారత్ అతిపెద్ద మార్కెట్. మనకు చైనా నుంచి కాకపోతే మరో దేశం నుంచి వస్తువులు వస్తాయి. కానీ భారత్ లాంటి పెద్ద మార్కెట్ లేకపోతే చైనాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇప్పటికే అమెరికా కూడా చైనా కంపెనీలపై ఆంక్షలు పెడుతోంది. ఇప్పుడు ఇండియా మొదలుపెట్టింది. భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఇదే బాటలో నడిస్తే చైనా అల్లకల్లోలం కావడం ఖాయం.
మరిన్ని వార్తలు: