సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తాజగా మీటూ ఉద్యమంకు మద్దతిచ్చి అందుకు సంబంధించిన తన అనుభవాలను కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు చిన్న తనంలో, యుక్త వయస్సులో మరియు సినీ కెరియర్‌లో ఎదురైన అనుభవాలను ఒక్కొక్కటి తాజగా పోస్ట్ చేశారు. దాంతో చిన్మయి ధైర్యానికి అంతా నివ్వెరపోయారు. తాజగా చిన్మయి చేసిన ట్వీట్స్ అందరిని కలవర పరుస్తున్నాయి. స్వచ్ఛమైన వజ్రంతో పోల్చే ప్రముఖ తమిళ కవి, రచయిత వైరముత్తుపై సంచలన ట్వీట్లు చేసింది. మచ్చ లేని చంద్రుడిగా పేరును సంపాదించుకున్న వైరముత్తు గురించి ఎవరు కూడా చెడుగా మాట్లాడరు. అలాంటిది చిన్మయి చేసిన ట్వీట్స్ అందరిని షాక్‌కు గురి చేస్తున్నాయి.
తాజాగా చిన్మయి ట్విట్టర్‌లో… నా మానసిక స్థితి బాగుంది, మానసింగా ఆరోగ్యంగా ఉన్నా, నేను పెట్టే పోస్ట్‌లన్నింటికి భాద్యత వహిస్తాను అని ముందుగానే హింట్‌లు ఇచ్చి లెజెండ్ రైటర్ వైరముత్తు పలువురు గాయినిలతో చేసిన అసభ్యకర ప్రవర్తనను కళ్లకు కట్టినట్టు పోస్ట్ చేసింది. వైరముత్తు అవకాశం ఇస్తాను అంటూ హోటల్‌కు రమ్మని ఆ తర్వాత తనతో ఒకరాత్రి గడపాలని ఒక సింగర్‌ని వేధించాడట. ఇకపోతే మరొక సింగర్‌కు బట్టర్ మిల్క్ ఆర్డర్ ఇచ్చి అది తాగుతుంటే.. నీ పెదాలకు ఏదో అంటుకుంది అంటూ ముద్దు పెట్టుకోబోయాడట. ఇంకో సింగర్‌ని ప్రశంసించడానికి పిలిపించి గదిలోకి రాగానే తలుపులు వేసి హఠాత్తుగా కౌగిలించుకోని అసభ్యకరంగా ప్రవర్తించాడట. ఒక 18ఏళ్ల సింగర్‌కు పాట లైన్‌ను వివరిస్తూ సడెన్‌గా ముద్దు పెట్టుకున్నాడట. ఇవన్నీ తన స్నేహితులకు ఎదురైన అనుభవాలు, అవి మీ అందరికి తెలియజేస్తున్నాని చిన్మయి ట్వీట్ చేసింది. చిన్మయి చేసేది అంతా పబ్లిసిటీ అని కొందరు అంటారు కానీ చిన్మయికి ఇలాంటి పోస్ట్‌లు చేసి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అంటూ ఆమె సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి చిన్మయి ట్వీట్స్ సంచలనంగా మారాయి.