చిన్నా విషయంలో చాలా ఫీల్‌ అయిన చిరంజీవి

Chiranjeevi Feels so much about the chinna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగిన విషయం తెల్సిందే. చిరంజీవి మేనేజర్‌ గంగాధర్‌ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని కేవలం రెండు రోజుల్లోనే దొంగను పట్టుకున్నారు. దొంగ మరెవ్వరో కాదు, చిరంజీవి ఇంట్లో చాలా కాలంగా పని చేస్తున్న చెన్నయ్య అలియాస్‌ చిన్నా అని తేలింది. రెండు లక్షల రూపాయలను దొంగతనం చేసిన చిన్నా 50 వేల రూపాయలను ఖర్చు చేశాడని, ఆయన నుండి 1.5 లక్షలను రికవరీ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. చిన్నా గతంలో కూడా రెండు సార్లు చిరంజీవి ఇంట్లో దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు.

తాజాగా చిన్నా విషయంలో చిరంజీవి సన్నిహితుల వద్ద స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో మనిషిలా చూసుకున్నా కూడా చిన్నా ఇలా చేయడం చాలా బాదగా ఉందని, నమ్మకం పై నమ్మకం లేకుండా పోతుంది అంటూ చిరంజీవి సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి ఇంట్లో పని చేస్తున్న మిగిలిన వారిపై కూడా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖుల ఇల్లలో ఇలాంటి సంఘటనలు చాలా కామన్‌గా జరుగుతుంటాయని, కాని ఇది మాత్రం పోలీసుల వరకు వచ్చిందని కొందరు అంటున్నారు.