ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో మీరు బయటకు రావొద్దు సకల సదుపాయాలు మీ కాళ్ళ దగ్గరకే తీసుకొస్తామని చెప్పి అంటున్నా సరే ఈ లాక్ డౌన్ ను మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమాత్రం ఖాతరు చెయ్యట్లేదు. మామూలు ప్రాంతాల్లో అంటే ఏమో కానీ రెడ్ జోన్ ప్రకటించిన జిల్లాల్లో కూడా ప్రజలు ఇంకా అవివేకంతోనే ప్రవర్తిస్తుండడం మరింత విచారకరం.
ఎప్పటికప్పుడు కరోనా మహమ్మారి కోసం తెలుపుతూనే ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జనం మాత్రం తమ వ్యవహార శైలిని మార్చుకోడం లేదు. ఇప్పుడు అలా రెడ్ జోన్ లో ఉన్న చిత్తూరు జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. చిత్తూర్ జిల్లా కొండసముద్రం ప్రాంతంలో కరోనాను తరిమెయ్యాలని భారీగా జనం గుమిగూడి పూజలు నిర్వహించారట. అందులోను ఎలాంటి మాస్కులు కానీ వేసుకోకపోగా ఎలాంటి సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదు. దీనితో ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది.