Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ కి ఇంకో షాక్ తగిలింది. నిర్మాత బండ్ల గణేష్ పరోక్షంగా చేసిన కామెంట్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు డాన్స్ మాస్టర్ రాకేష్ అంతకు మించి వంశీ మీద విరుచుకుపడ్డాడు. సీతారామశాస్త్రి పాటల ప్రయాణానికి ఇంధనంగా నిలిచిన జగమంత కుటుంబం అనే పాట చక్రం సినిమా కోసం తీస్తున్నప్పుడు రాకేష్ ని డాన్స్ మాస్టర్ గా నియమించుకున్నారట. అయితే తనని పక్కనబెట్టుకుని పనంతా తానే చేసుకున్నాడని కృష్ణవంశీ మీద రాకేష్ ఫైర్ అయ్యాడు. అంతే కాకుండా మొత్తం 11 రోజులు పనిచేయించుకుని ఒక్క పైసా ఇవ్వకుండా బయటికి పంపారని కృష్ణవంశీ మీద రాకేష్ బూతులు అందుకున్నాడు. ఓ యు ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాకేష్ ఈ మాదిరిగా చెలరేగిపోయాడు.
ఇక కృష్ణవంశీ సృజనాత్మకత మీద కూడా రాకేష్ దారుణమైన కామెంట్స్ చేసాడు. ఎలా వ్యవహరించాలో తెలియక పోవడం వల్లే ఇప్పుడు వంశీ బజార్న పడ్డాడని రాకేష్ మాస్టర్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇంతకు ముందు బండ్ల గణేష్ కూడా పేరు ఎత్తకుండా కృష్ణవంశీ మీద ఇలాంటి ఆరోపణలే చేసాడు. అప్పుడు కూడా కృష్ణవంశీ కౌంటర్ ఇవ్వకుండా మౌనం దాల్చాడు. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఇంత దూకుడుగా వ్యవహరించినా వంశీ తిరుగు మాట్లాడకపోతే ఇండస్ట్రీ ఏమనుకుంటుందో… ఏమిటో? ఇప్పటికే నక్షత్రం సినిమాని బయటకు తీసుకురావడానికి నానా ఇబ్బందులు పడుతున్న కృష్ణ వంశీకి రాకేష్ మాస్టర్ కామెంట్స్ చేటు చేస్తాయనడంలో సందేహం లేదు.
మరిన్నివార్తలు
‘సాహో’ కంటే ముందు బాలీవుడ్లో..!
క్రైమ్ కన్నా సెక్స్ ఎక్కువైంది.
బుల్లితెరపై దృష్టిపెట్టిన యువ హీరో