పప్ ప్లీజ్.. ఒక్క సిగరెట్ తో ముగ్గురికి కరోనా…..

Cigarettes May harm pregancy be carefull

కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంటే దాన్ని ఇంకా తేలికగా తీసుకుంటుంది సమాజం. అసలు కరోనా అనే మహమ్మారి ఎలాగ సంక్రమిస్తుందో ఎలాగ వెళ్తుందో కూడా ఇంతవరకు కనిపెట్టలేక పోతున్నారు. అందుకు కారణం అది కనపడని వైరస్ కాబట్టి. అయితే తెలంగాణలో కరోనా పలు రకాలుగా మనుషులపై అటాక్ చేస్తుంది.

తాజాగా ఒక్క సిగరెట్ తో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు షేరింగ్ లతో సిగరెట్ పప్ ముగ్గురు పీల్చేయడంతో వారందరికీ కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ యువకుడు హైదరాబాద్ జియగూడాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లి వచ్చాడు. అయితే షాద్ నగర్ వచ్చి తన ఫ్రెండ్స్ తో కలిసి సిగరెట్ తాగాడు. అయితే అతడు ఒక్కడూ సిగరెట్ తాగితే బాగుండేది. అలా కాకుండా ఒకే సిగరెట్ ముగ్గురు షేరింగ్ చేసుకోవడంతో ఒకరి తర్వాత ఒకరికి ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. దీంతోపాటు షాద్ నగర్ నుండి హైదరాబాద్ జియాగూడ వరకూ కారులో వెళ్లడంపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పటికే షాద్ నగర్ లో కరోనా కేసులు 7కు చేరుకోవడంతో సర్వత్రా కలకలం మొదలైంది.