పవన్‌, త్రివిక్రమ్‌ చేసింది క్షుద్రపూజ కాదు

clarity on Tantrik Poojas of Pawan-Trivikram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌పై గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్న కత్తి మహేష్‌ ఆ విమర్శల వేడిని మరింతగా పెంచాడు. గతంలో జరిగిన విషయాలను ఇప్పుడు మీడియా ముందుకు తీసుకు వచ్చి పవన్‌పై కత్తి మహేష్‌ విమర్శలు చేయడం జరుగుతుంది. పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌లు కలిసి తాంత్రిక పూజలు చేయడం జరిగిందని, అందుకు సంబంధించిన వీడియో తన వద్ద ఉందని, ఆ పూజలు నరసింహా అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరిగినట్లుగా తన వద్ద ఆధారాలు ఉన్నాయి అంటూ కత్తి మహేష్‌ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. సాదారణంగా పవన్‌ కళ్యాణ్‌ ఎక్కువ పూజల్లో పాల్గొనడు. అలాంటిది తాంత్రిక పూజలు చేయడం ఏంటని మెగా ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో కత్తి మహేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కత్తి మహేష్‌ ఆరోపిస్తున్న తాంత్రిక పూజలపై టీవీ9 ఒక క్లారిటీ ఇచ్చింది. జల్సా సమయంలో పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌లు కలిసి ఒక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పూజ ఎట్టి పరిస్థితుల్లో తాంత్రిక పూజ కాదు. అది ఒక రకమైన దైవ పూజ అని, రాత్రి సమయంలో చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, అందుకే సెలబ్రెటీలు రాత్రి సమయంలో ఆ పూజా కార్యక్రమాలు చేస్తారని, నరసింహా అనే వ్యక్తి తాంత్రిక పూజలు చేయించడని, గతంలో పవన్‌, త్రివిక్రమ్‌లు మాత్రమే కాకుండా మహేష్‌తో పాటు ఇంకా పలువురు టాలీవుడ్‌ స్టార్స్‌ కూడా ఆ పూజలు చేయడం జరిగిందని టీవీ9 ఎంక్వౌరీలో తేలింది. దాంతో కత్తి మహేష్‌ ఆ విషయమై నీళ్లు నమిలాడు. టీవీ9 వారు చెప్పిన వివరాలు నిజం అయ్యి ఉండక పోవచ్చు అని, తాను భావిస్తున్నట్లుగా అది తాంత్రిక పూజే అయ్యి ఉంటుందని కత్తి మహేష్‌ మళ్లీ అదే మాట మాట్లాడటం జరిగింది. మొత్తానికి కత్తి మహేష్‌ చేస్తున్న ఒక్కో విమర్శ మెగా ఫ్యాన్స్‌కు పెద్ద తల నొప్పిగా మారింది.