Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏదో అధినేత మంచి మూడ్ లో ఉన్నారని పిచ్చి పిచ్చ వేషాలు వేస్తే.. టీడీపీలో కుదరదు. ఈ విషయంలో ఎవరైనా ఒకటేనని, స్వపర భేదం లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. పరిటాల రవి ముఖ్య అనుచరుడిగా పార్టీకి చమన్ ఎంతో సేవ చేసినా.. ఒప్పందాన్ని అతిక్రమించినప్పుడు రాజీనామా చేయాల్సిందేనని బాబు కుండబద్దలు కొట్టారట. అనంతపురం జడ్పీ పరిధిలో టీడీపీకి మెజార్టీ సీట్లు రావడంతో.. ఛైర్మన్ పదవి ఆపార్టీకే దక్కింది. అయితే అప్పట్లో పోటీ ఎక్కువుండి, మొదటి రెండున్నరేళ్లు, తర్వాత రెండున్నరేళ్లు నాగరాజుకు పదవి ఖాయమైంది.
కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. చమన్ మాత్రం మొదట ఒప్పందానికి అంగీకరించి, తర్వాత అడ్డం తిరిగారు. అయితే సరిగ్గా చమన్ పదవీకాలం ముగిసే సమయానికి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో.. బాబు అతడి టైమ్ కాస్త పొడిగించారు. కానీ తర్వాత కూడా రిజైన్ చేయడం లేదని ప్రత్యర్థి వర్గం ఫిర్యాదు చేయడంతో.. ఆయన సీరియస్సయ్యారు. పదవిచ్చేటప్పుడు అన్నింటికీ తలఊపి తర్వాత ఇలాంటి వేషాలు వేస్తే కుదరదని తేల్చారట. ఈ విషయంలో తాను కూడా ఏమీ చేయలేనని మంత్రి సునీత చెప్పడంతో చమన్ కు రాజీనామా తప్పలేదు.
అందుకే చంద్రబాబుతో చమత్కారాలు చేయకూడదనేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆయన ఎంత జోవియల్ గా ఉన్నా ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తారని, ఏమాత్రం తేడా కొట్టినా సహించరని చెబుతున్నారు. ఈ విషయం చమన్ కు తక్కువగా తెలియడం వల్లే.. ఎక్స్ ట్రాలు చేశారని, ఈ దెబ్బతో లైన్లోకొస్తారని భావిస్తున్నారు. పరిటాల సునీత కూడా ఒకటికి రెండుసార్లు చమన్ కు నచ్చజెప్పినా.. ఆయన వినకపోవడంతోనే.. బాబే డైరక్టరుగా రంగంలోకి దిగి కఠినంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని వార్తలు: