Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Cm KCR Planing Buildings For MLS For Dasara
తెలంగాణ సీఎం కేసీఆర్ పండగలను పబ్లిసిటీ చేయడంలో సిద్ధహస్తులు. ఆయన ఏం చేసినా దానికో పరమార్థం ఉంటుంది. ఓ వర్గానికి మేలు చేశారంటే.. సదరు ఓట్లన్నీ తన పార్టీకే పడేలా ముందే ప్లాన్ చేసుకుంటారు. ఈసారి ఏకంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లపైనే కన్నేశారు. ప్రతిపక్ష నేతలూ మెచ్చుకునే పని చేస్తున్నారు. అదే దసరా ఫ్లాట్స్ ఆఫర్.
దసరాకు పాత ఎమ్మెల్యే క్వార్టర్లో 120 మంది ప్రజా ప్రతినిధులకు కొత్త ఇళ్లు కట్టిస్తున్నారు కేసీఆర్. దీంతో ఎమ్మెల్యేలంతా గృహప్రవేశం తర్వాత కేసీఆర్ ను తిట్టడానికి సందేహిస్తారనేది గులాబీ నేతల భావన. కానీ నిజంగా అలా జరుగుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. 8లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్న ఫ్లాట్లలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇండోర్ గేమ్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు ఎమ్మెల్యేల్ని ఊరిస్తున్నాయి.
రెండేళ్ల క్రితమే వీటి నిర్మాణం పూర్తికాగా.. రేపు దసరాకి పూర్తవుతాయి. దసరా రోజు ప్రారంభోత్సవం చేసి.. ఎమ్మెల్యేలతో గృహప్రవేశం చేయాలనేది కేసీఆర్ ప్లాన్. ఎమ్మెల్యేలతో పాటు వారి వద్ద పనిచేసే సర్వెంట్స్ కోసం కూడా పక్కనే ఫ్లాట్లు కట్టాలన్న కేసీఆర్ ఆలోచన అద్భుతమంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా.. వారి దగ్గరి పనివారైనా.. తమ పార్టీకే ఓటేయడం ఖాయమని ధీమాగా ఉన్నాయి.