బాబే టార్గెట్ గా కేసీఆర్…ఇదేం విచిత్రమో…?

CM KCR Specially Target AP CM Chandrababu Naidu

కాంగ్రెస్, టీడీపీ మహాకూటమితో దగ్గర అయినప్పటి నుంచి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మరోసారి చంద్రబాబు మీద విమర్శల దాడి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీ కలసి పోటీ చేయడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త అర్థం చెప్పారు. ఆ రెండు పార్టీలు పెట్టుకున్నది పొత్తు కాదన్నారు. పొత్తు ద్వారా … తెలంగాణలో అడుగు పెట్టి… చంద్రబాబు.. మీ ఇంటికే వచ్చి కొట్టి పోతా అంటున్నారని మనం ఊరుకుందామా బుద్ధి చెబుదామా? అంటూ ప్రజలనే ప్రశ్నించారు. చంద్రబాబును నిలదీసి అడగాలని పిలుపునిచ్చారు. గతంలో జడ్చర్ల టీడీపీ బలమైన నియోజకవర్గంగా ఉండేది. ఆయితే ఈ సారి అక్కడ కాంగ్రెస్ తరపున మల్లు రవి పోటీ చేస్తున్నారు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, మక్తల్ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. అందుకే ఆ జిల్లాలో టీడీపీని టార్గెట్ చేశారు కేసీఆర్. ‘తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు వలసలు తగ్గాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు కూడా తిరిగి జిల్లాకు వస్తున్నారు. తెలంగాణ కల సాధించుకున్నాం. ఇప్పుడు కోటి ఎకరాల తెలంగాణ పచ్చగా చేయాలన్న కలను సాకారం చేసుకుందాం.

KCR Fair on Chandrababu

రాష్ట్రం రానే రాదని అందరూ హేళన చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏకతాటిపై నిలిచి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసుకున్నాం. ప్రాజెక్టుల పనులు చేపట్టి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశాం’ అన్నారు. చంద్రబాబు ఈ జిల్లాలో కొందరిని పోటీకి పెట్టారు. ఆయన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ‘వదల బొమ్మాళి.. వదలా’ అంటూ రాష్ట్రంలోకి మళ్లీ వస్తున్నారు. గతంలో నా వంతు నేను ఒకసారి తరిమి కొట్టా. ఇప్పుడు ఆయన్ను తరిమికొట్టాల్సిన బాధ్యత మీదే. పాలమూరు జిల్లాను తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఆయన ఏం చేశారు?. కానీ, ఇప్పుడు అన్ని పనులు వరుసగా జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. టీడీపీ వస్తే ప్రాజెక్టులు పూర్తి కావు..నీళ్లు రావని హెచ్చరించారు. సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే భవిష్యత్ నాశనమేనన్నారు. ఏ ముఖం పెట్టుకుని టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్రశ్నించారు. అదేమీ విచిత్రమో కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కన్నా టీడీపీనే ఎక్కువగా అదీ కూడా చంద్రబాబునే గురి పెడుతున్నారు. టీడీపీకి ఓటేస్తే ఏదో జరిగిపోబోతోందన్న భావన కల్పించడానికి ప్రయాణిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తూండటంతో అక్కడ అదే భజన మహబూబ్ నగర్ జిల్లాలోనూ అదే భజన చేశారు. తెలుగుదేశం పార్టీ ఉన్న చోట తెలంగాణా సెంటిమెంట్ ను పెంచేందుకు కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీ నుండే ఎంపీ కూడా రాజీనామా చేయడంతో ఆ ప్రభావం పార్టీ మీద ఖచ్చితంగా పడనుంది.

chandrababu-kcr