Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక్కసారి పవర్ లో ఉండటానికి అలవాటు పడితే అధికారం లేకుండా ఉండటం చాలా కష్టం. ఒకవేళ పదవి దూరం అయితే ఐసీయూ ఉన్న పేషెంట్ కి ఆక్సిజన్ మాస్క్ పనిచేయకపోతే ఎట్టా గిలగిలలాడతాడో అలా అయిపోతాడు. అందుకే ఓ పదవిలో ఉండగానే ఇంకో పదవి కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. 2014 ఎన్నికల టైం లో రాయలసీమలో సీఎం రమేష్ చెప్పిందే వేదంగా నడిచింది. అయితే ఆ తర్వాత పరిణామాల్లో సాటి ఎంపీ సుజనా కేంద్రమంత్రి అయితే సీఎం రమేష్ అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. పైగా సీఎం చంద్రబాబు కూడా రమేష్ ని కాస్త కంట్రోల్ లో పెడుతూ వచ్చారు. అటు సీఎం రమేష్ రాజ్యసభ పదవీకాలం కూడా వచ్చే ఏడాది తో ముగుస్తుంది. మళ్లీ ఎంపీ కావాలని కోరిక వున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ లో రాజ్యసభ టికెట్ రావడం కష్టమే.
ఈ పరిణామాలు అన్ని అంచనా వేసుకున్న సీఎం రమేష్ వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇందుకోసం సొంత జిల్లా కడప లోని ప్రొద్దుటూరు నియోజకవర్గం మీద కన్ను వేసాడట. కిందటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గ టికెట్ కోసం జరిగిన రచ్చ అందరికీ గుర్తు వుండే ఉంటుంది. 2009 లో కడప మొత్తం మీద ఈ ఒక్క చోటే టీడీపీ గెలిచింది. అలాంటి ఎమ్మెల్యే లింగారెడ్డి ని పక్కనబెట్టి చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వరదరాజులు రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీని వెనుక సీఎం రమేష్ హస్తం వుందన్నది బహిరంగ రహస్యమే. అప్పటి ఎపిసోడ్ తాలూకా ప్రకంపనలు ఇంకా వున్నాయి. ఇప్పటికీ లింగారెడ్డి, వరదరాజులు రెడ్డి వర్గాలు కలిసిపోలేదు. పైగా వరదరాజులు రెడ్డి వరసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయి వున్నారు. ఇదే సాకుగా చూపి ఇద్దరికీ టికెట్ రాకుండా చేసి తాను అక్కడ నుంచి mla గా పోటీ చేయడానికి రమేష్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక రాజకీయంగా లింగారెడ్డి వర్గాన్ని దువ్వుతున్నారు. తనకు, వరదరాజులరెడ్డికి కాకుండా వేరే ఎవరికీ టికెట్ ఇచ్చినా పర్లేదని లింగారెడ్డి తో చెప్పించేలా వర్కౌట్ చేస్తున్నారట. మొత్తానికి సీఎం రమేష్ ముందు చూపు కడప రాజకీయాల్లో ఆరితేరిన వాళ్లకి కూడా షాక్ ఇస్తోంది.