
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాము బయటకు వచ్చి కేంద్రానికి అండగా ఉన్నామని ప్రకటించి.. మద్దతు తెలిపామని ఆయన గుర్తు చేశారు. ఆనాడు కనీసం మమ్మల్ని అభినందించని వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారంటూ కిషన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.





