తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హోదా మరిచి సామాన్యుడిలా మారిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో సీఎం రేవంత్ పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్దిదారుడి ఇంటికి వెళ్లారు. అందరితో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. అనంతరం వారి జీవన పరిస్థితులు, కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.