Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి బస్సు యాత్ర పేరుతో ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టిన పవన్‌కళ్యాణ్ కి సంబందించిన జనసేనలోకి వలసల పర్వం స్టార్ట్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ అన్ని స్తానలా పోటీ చేస్తానని చెప్పడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే పలువురు ఔత్సాహికులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జనసేన తరపున టికెట్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన జనసేనలో జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ (లల్లూ భాయ్) జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆయన సన్నిహిత వర్గాల నుండి బయటకి వచ్చింది. పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కొందరు పార్టీ నేతలు లల్లూ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో ప్రస్తావించినట్టు సమాచారం. లల్లూ అనుచరులు, పవన్ సన్నిహితుల మధ్య చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. పవన్ నుంచి సానుకూల స్పందన రావడంతో… వచ్చే నెలలో లల్లూ జనసేనలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయంపై పవన్, లల్లూల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే లల్లూ గానీ పవన్ కల్యాణ్ గానీ ఇంత వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా, ఇచ్ఛాపురంకు చెందిన నరేష్ కుమార్ అగర్వాలా 2004 లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే లల్లూ వచ్చే ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి జనసేన తరపున అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.