Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల వ్యవహారంపై ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇంట్లోకి ఇతరులు ఎవరూ వచ్చే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పైగా ఆధారాల్లేకుండా తుడిచేసే ప్రయత్నం జరగడం కూడా సందేహాలకు తావిస్తోంది.
విక్రమ్ గౌడ్ కు అప్పులున్నాయని వాట్సప్ మెసేజ్ లు ద్వారా నిర్థారణ కావడంతో.. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి ఎక్కువ కావడంతో.. ఆత్మహత్యాయత్నం చేసి బెదిరించారని చెప్పుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే.. విక్రమ్ గౌడ్ కేసు ఆత్మహత్యాయత్నం కేసుగా మారడానికే ఎక్కువ అవకాశాలున్నాయి.
విక్రమ్ గౌడ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో అందరికీ తెలుసు. ఆయనపై దాడి చేసే సాహసం ఎవరూ చేయరు. అయినా సరే పోలీసులు మాత్రం గోప్యంగానే ఉంచుతున్నారు. ఎందుకైనా మంచిదని ఆధారాల కోసం వేచి చూస్తున్నారు. ఏ ఒక్క లింక్ దొరికినా.. విక్రమ్ గౌడ్ బుక్కౌతారనేది పోలీస్ సర్కిల్ టాక్.
మరిన్ని వార్తలు: