వీహెచ్ హత్యకు కుట్ర…!

Congress-Leader-V-Hanumanth

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హన్మంతరావు ప్రమాదంలో చిక్కుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో బుధవారం రోడ్ షో అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగుపయనం అయ్యారు. ఈ సమయంలో తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామ శివారులో ఆయన ప్రయాణిస్తున్న వాహనం వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో ప్రచార రథం ఒక పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో విహెచ్ తో పాటు ప్రయాణిస్తున్న నాయకులకు తృటిలో ప్రమాదం తప్పినట్లు అయ్యింది. అయితే విహెచ్ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ప్రచార రథం చక్రాల నట్లు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విప్పి పడేశారని తేలింది. అందుకే ప్రచార రథం వెనుక గిల్లలు ఊడిపోయాయని వారు చెబుతున్నారు.

V-Hanumantha-Rao

ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ వయసు రీత్యా పెద్దవాడయిన వీహెచ్ ఈ ఘటనతో కాస్త షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విహెచ్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ఫినిష్ చేయాలని కేసిఆర్ ప్రభుత్వం చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా కాంగ్రెస్ వర్గాల్లో కలవరం రేపింది. అన్ని గిల్లలు ఒకేసారి ఊడిపోవడాన్ని కుట్రగా భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ పని టిఆర్ఎస్ వారే చేశారని నేరెళ్లలో బాధిత దళితులకు అండగా ఉన్నందుకు అక్కడి టిఆర్ఎస్ వారు ఈ పనిచేశారని వీహెచ్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించే వరకు అక్కడి నుంచి కదలనని అన్నారు.