Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్పీకర్ అవకాశం ఇవ్వకపోయినా ఆమె మాట్లాడేందుకు పదేపదే ప్రత్నించడం తో పాటు స్పీకర్‌కు దమ్ముంటే తనపై చర్య తీసుకోవాలని సభాపతినే సవాల్ చేసిన ఆ మహిళా ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు పడింది. అయినా ఆమె ఎంతకూ సభ బయటకు రాకపోవడంతో ఆమెను స్పీకర్ ధన్‌పాల్ అసెంబ్లీ నుంచి ఉన్నపళాన గెంటివేయించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తన నియోజకవర్గంలోని ఓ సమస్యపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ ధరణి స్పీకర్‌ను కోరారు. అయితే దీనిపై ఉదయం 9:40లోపే నోటీసు ఇవ్వాల్సిందంటూ… అప్పటికప్పుడు ఆమెకు అవకాశం ఇచ్చేందుకు స్పీకర్ తిరస్కరించారు. ఆమె పదేపదే స్పీకర్‌ను సమయం కోరినప్పటికీ… ‘‘వెళ్లి మీ స్థానంలో కూర్చోండి. లేకుంటే మీపై చర్యలు తీసుకోక తప్పదు’’ అంటూ స్పీకర్ విజయధరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఆమెను మార్షల్స్ బలవంతంగా సభ బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి కర్ పీ ధన్‌పాల్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఉద్దేశించి సభలో స్పీకర్ లైంగికపరమైన వ్యాఖ్యలు చేశారని, దీంతో తాను కన్నీటిపర్యంతమయ్యానని ఆమె మంగళవారం మీడియా ముందు ప్రకటించారు. తన జిల్లాలో షార్ట్ సర్క్యూట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చే పరిహారం అంశాన్ని సభలో ప్రశ్నించే ప్రయత్నం చేయగా, స్పీకర్ తిరస్కరించడంతోపాటు, మంత్రితో వ్యక్తిగతంగా డీల్ చేసుకోవాలని సూచించినట్టు ఆరోపించారు. ‘‘స్పీకర్ సభాముఖంగానే మంత్రితో వ్యక్తిగతంగా బయట డీల్ చేసుకోవాలని చెప్పారని ఆమె పేర్కొనారు. ‘మీరు, మంత్రి కలిసి వ్యక్తిగత ఒప్పందం చేసుకోండి. ఇందులోకి సభను లాగవద్దు’ అని ఆయన చేసిన వ్యాఖ్యలతో తాను ఆవేదన చెంది కన్నీటి పర్యంతమయ్యాయనని ఆమె తెలిపారు.