Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై నేతలతో పాటు ఆయన తల్లి సోనియాకు కూడా నమ్మకం పోతోంది. కానీ చేసేదేమీ లేదని పార్టీ నేతలు నిట్టూరుస్తున్నారు. ధృతరాష్ట్రుడి లెవల్లో పుత్ర వ్యామోహం చూపిస్తున్న సోనియా.. తన చేతులతోనే పార్టీని సమాధి చేస్తున్నారని సీనియర్లు గొణుక్కుంటున్నారు. అయినా సరే ధైర్యం చేసి అల్టర్నేటివ్ లీడర్ గురించి మాట్లాడలేకపోతున్నారు.
పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్న రాహుల్.. సిన్సియర్ గా ప్రతిపక్ష నేతగా పనిచేయడం లేదనే వాదనలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో విపక్షాల ర్యాలీ ఎగ్గొట్టి మరీ విదేశీ పర్యటనకు వెళ్లడం నేతలు ఎవరికీ మింగుడు పడటం లేదు. దీనికి తోడు వ్యక్తిగతంగా దేశంలో వీవీఐపీ హోదాను అనుభవిస్తున్న రాహుల్.. ప్రధాని కాకపోయినా పర్లేదనే ధోరణితో ఉన్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని కాకపోయినా.. దేశానికి చేయాల్సిన మేలు చేయొచ్చన్న ఒరిజినల్ గాంధీ సిద్ధాంతాన్ని పట్టుకున్న రాహుల్.. కాంగ్రెస్ ను నట్టేట్లో ముంచుతున్నారని కార్యకర్తలు బాథపడుతున్నారు. ప్రియాంక గాంధీ రారు. రాహుల్ ఉన్నా ఉపయోగం లేదు. సోనియా యాక్టివ్ గా పనిచేయలేరు. దీంతో అగ్రనాయకత్వం విషయంలో ఉన్న అయోమయం కాంగ్రెస్ ను బ్యాక్ బెంచ్ కే పరిమితం చేస్తోంది.
మరిన్ని వార్తలు: