మోడీ ముందు నీ సంగతి చూసుకో…

Congress Party Rivers Counters To Modi In Karnataka Election Campaign

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గురివింద గింజ తన కింద నలుపు చూసుకోకుండా ఎదుటివారి కింద నలుపు చూసి ఎక్కిరిస్తున్దంట అలా ఉంది మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి వ్యవహారం. ఎదుటివారికి చెప్పే నీతులు, తాము ఆచరించాకనే మిగతా వారికి చెప్పాలి. ప్రధాని మోడీకి ఈ విషయం అర్థం కాకపోవడం ఏంటో మరి. తనకి రాజకీయ భవిష్యతునిచ్చిన అద్వానీని అవమానించిన మోడీ ఈరోజు రాహుల్ దేవేగౌడ మీద చేసిన వ్యాఖ్యలు గురించి మాట్లాడటం  అలానే అనిపిస్తోంది. నిజానికి  బీజేపీ సీనియర్ నేత అద్వానీకి దక్కాల్సిన ప్రధాని పదని మోడీ దక్కించుకున్నారు. ఆ తరువాత కూడా బీజేపీ లో తనకు ఎన్ని అవమానాలు జరుగుతున్నా మౌనంగా భరిస్తూవచ్చారు అద్వానీ. 
కానీ ఇటీవల జరిగిన ఓ ఘటనను మాత్రం అద్వానీయే కాదు.. ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఇటీవల త్రిపురలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా మోడీ సహా బీజేపీ పెద్దలు అక్కడకి వెళ్లారు ఈ సందర్భంగా సభ మీదకి వచ్చిన మోడీ మోడీ అందరికీ నమస్కారం చేశారు కానీ..అక్కడే ఉన్న అద్వానిని మాత్రం పట్టించుకోలేదు. అంత పెద్ద వయసులో ఉన్న ఆయన నమస్కారం పెడితే.. ప్రతినమస్కారం కూడా చేయకుండా ఆయన్ని గుర్తించినట్టు ప్రవర్తించారు. ఇక ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.అలాంటప్పుడు మోడీ ఇతరుల గురించి మాట్లాడే హక్కు లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.
కర్నాటకలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ సందర్భంగా జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడపై కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో దేవెగౌడ కుమ్మక్కు అయ్యారని, తన కుమారుడు కుమారస్వామిని ఢిల్లీకి పంపి… అమిత్ షాతో రాయబారాలు నెరిపారాని రాహుల్ ఆరోపించారు. అయితే నిన్న ఎన్నికల ప్రచారానికి కర్నాటక వచ్చిన మోడీ మాత్రం దేవెగౌడ చాలా పెద్ద మనిషని అలాంటి వ్యక్తిని అగౌరవంగా మాట్లావద్దని చెబుతున్నారు మోడీ. అయితే దీని మీద కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందించింది. 
తన రాజకీయ గురువు ఎల్ కే అడ్వాణి మీద లేని ప్రేమ జేడీఎస్ పార్టీ నేత దేవేగౌడ మీద ఎలా వచ్చింది అంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించారు. హెచ్.డి. దేవేగౌడ తన హృదయంలో ఉన్నారన్న మోడీ వ్యాఖ్యలని ఉద్దేశించి ఆయన మీ గుండెల్లో ఉంటె మీ గురువు అద్వానీ ఎక్కడున్నారని కాంగ్రెస్ నేతలు మోడీని ప్రశ్నిస్తున్నారు. నిజమే మరి ఈరోజు ఎన్నికలు వచ్చాయి అబ్వసరం వచ్చింది కాబట్టి ఆయన్ని భుజానికి ఎత్తుకుంటున్నారు, అదే దేవేగౌడని వ్రుద్దశ్రమానికి వెళ్ళమన రోజున ఆ గౌరవం ఏమయిందో మరి ?