సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ మధ్య వివాదాలు ఉన్నాయని రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా కంఠకుడైన పరిపాలకుడిని తిట్టకుండా, తనని తిట్టడం ఏంటని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు బాధపడ్డారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఉచితంగా ఇస్తే ఒక రాష్ట్రం ఏమైపోతుందో ఏపీను చూడండి అని గతంలో పేర్కొన్న ప్రశాంత్ కిషోర్ గారు, తనపై నీలాపనిందలు వేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారని, జగన్ మోహన్ రెడ్డి గారు మంచివాడని తనలాగే, ప్రజలలాగే ప్రశాంత్ కిషోర్ గారు నమ్మారన్నారు.
అతను మహానటుడు , ఎవరైనా నమ్ముతారని, అంతటి మహోత్తమ వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారని అన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ గారికి ఐపాక్ టీంకు సంబంధం లేదని, ఈ సంస్థకు రిషి రాజ్ సింగ్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ గారు ఐప్యాక్ ను వదిలేసి బీహార్ లో పార్టీని స్థాపించి ప్రచారం నిర్వహించుకుంటున్నారని, మధ్య నిషేధం అమలు చేస్తే ఎన్నికల్లో ఓట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ గారు చెబితే, కొన్ని వేల కోట్లను తినడానికి ముఖ్యమంత్రి గారు మద్యం విక్రయాలను వేదికగా మలుచుకున్నారని అన్నారు.