ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4,994 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 37,162 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,994 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని పేర్కొంది.

తాజాగా కరోనాతో కోలుకున్న 1,232 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 25,574కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,336 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 62 మరణాలు సంభవించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 758కి చేరింది. మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 13,86,274 శాంపిల్స్‌ను పరీక్షించారు.