తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా పై పోరుకు ఆదివారం రాత్రి (ఏప్రిల్ 5) 9 గంటలకు విద్యుత్ దీపాలను ఆపి.. ఇంటి ముందు కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించిన సంకల్పం చేసుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపును దేశయావత్తూ ఆచరించింది. ఆదివారం రాత్రి యావత్తు భారతావని దివ్వెల కాంతుల్లో వెలిగిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కేసులు భారీగానే నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్‌లో 69 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 334కి చేరుకోగా, ఏపీలో ఇది 258గా ఉంది. తెలంగాణలో 34 మంది కోలుకోగా, ఏపీలో ఐదుగురు కోలుకున్నారు. తెలంగాణలో 11 మంది, ఏపీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

కర్నూలు జిల్లాలో  ఒక్కరోజే 52 కొత్త కేసులు అక్కడ నమోదయ్యాయి.  శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సాయంత్రం వరకు 68 కొత్త కరోనా కేసులు నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 258కి చేరింది.తెలంగాణలో ఆదివారం కొత్తగా 62 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 334కు చేరింది. వీరిలో 33 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లగా, 11 మంది మృతిచెందారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 290 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం నిర్ధారణ అయిన 62 కేసుల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 52 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో హైదరాబాద్‌లో మొత్తం కేసుల సంఖ్య 156కు పెరిగింది.

.